Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్

ఏపీ, తెలంగాణలోని ఇద్దరు బలమైన నేతల మధ్య కొత్త వార్ మొదలైంది. అది కాస‌్తా రాజీనామా సవాళ్ల వరకు చేరింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దమంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సవాల్ విసిరారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.

Raja singh VS Silpa Chakrapani: 'ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా'..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్
Follow us

|

Updated on: Dec 26, 2020 | 3:34 PM

ఏపీ, తెలంగాణలోని ఇద్దరు బలమైన నేతల మధ్య కొత్త వార్ మొదలైంది. అది కాస‌్తా రాజీనామా సవాళ్ల వరకు చేరింది. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దమంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు సవాల్ విసిరారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి. రాజా సింగ్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు బహిరంగ చర్చకు సిద్దమన్నారు. తనపై ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాకు సిద్దమా అని ప్రశ్నించారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి తామెవరమని, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారని వివరించారు. హిందూ మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ చూస్తోందని దుయ్యబట్టారు. తన హిందుత్వం గురించి  పీఠాధిపతులను, మఠాధిపతులను అడిగితే చెబుతారన్నారు. ఎన్నో దేవాలయాలకు తాను ఆర్థిక సహాయం అందించానని, అలాంటి తనను పట్టుకొని హిందూ ద్రోహిగా ముద్రవేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రజాక్ అనే వ్యక్తి పార్టీ కార్యకర్త మాత్రమేనని, తన బినామీ అంటూ అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదన్నారు.

వివాదం ఏంటంటే…

శ్రీశైలంలోని దుకాణ సముదాయాల్లో ముస్లింలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ రాజాసింగ్ ఆరోపణలు చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చిన షాపులను తీసేయాలని కోర్టు ఆదేశించినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే చక్రపాణి ఓ టీమ్ తయారుచేసి, రజాక్ అనే వ్యక్తిని ముందుంచి చక్రం తిప్పుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో ముస్లింలకు ఎక్కువ శాతం షాపులు ఇచ్చారని, గతంలో టీడీపీ హయాంలో కూడా ఇదే జరిగిందన్నారు. గతంలో శ్రీశైలానికి వెళ్లినప్పుడు మాంసం, మద్యం, మత్తుపానీయాలు చాలా మంది ఫిర్యాదులు చేశారని.. శ్రీశైలం దేవస్థానాన్ని కాపాడాలని ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

Also Read :

PM Kisan: పీఎం కిసాన్… న‌గ‌దు మీ ఖాతాల్లోకి పడ్డాయో లేదో ఎలా ఇలా చెక్ చేసుకోండి…

Tirumala News : వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏడు కొండలవాడికి భారీ ఆదాయం..లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం

Andhrapradesh: ఆర్థిక వివాదాల పరిష్కారానికి ఏపీలో ప్రత్యేక కోర్టులు..ఆన్‌లైన్‌ ద‌్వారానే ఫిర్యాదులు..ఆరు నెలల్లో పరిష్కారం