Signature Forgery: ఏపీలో మంత్రి సంతకం ఫోర్జరీ సంచలనంగా మారింది. తన సంతకాన్ని కడప జిల్లాకు చెందిన టీడీపీ నేత ఫోర్జరీ చేశారని మంత్రి తానేటి వనిత డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రెడ్డెప్ప అనే వ్యక్తికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకునేందుకు 1.26 ఎకరాల అసైన్డ్ భూమిని కేటాయించాలంటూ కలెక్టర్‌కు తానేటి వనిత లెటర్ ప్యాడ్‌పై సిఫార్సు లేఖ రాస్తూ ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేశారు. రీ-వెరిఫికేషన్ నేపథ్యంలో కలెక్టర్ మంత్రికి సమాచారం అందించగా మొత్తం ఉదంతం బయటికి వచ్చింది.
దీనితో వెంటనే స్పందించిన మంత్రి తానేటి వనిత హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. అంతేకాకుండా అఫీషియల్‌గా లేఖ రాసి తన సంతకాన్ని ఫోర్జరీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, మంత్రి లెటర్ హెడ్, సంతకం ఫోర్జరీ కావడంతో ఏపీలో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.