టీవీ9 కవరేజ్ అద్భుతం : మంత్రి సబిత

శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థమైన ఉదంతాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోన్న టీవీ9 కవరేజ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగి ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేయడం అభినందనీయమన్నారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముంపు కాలనీల్లో టీవీ9 కవరేజ్ పై స్పందించిన ఆమె, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లేలా గూడ చెరువు వరదను […]

టీవీ9 కవరేజ్ అద్భుతం : మంత్రి సబిత
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 18, 2020 | 12:56 PM

శనివారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్థమైన ఉదంతాల్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తోన్న టీవీ9 కవరేజ్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. బాలాపూర్ గుర్రం చెరువు కట్ట తెగి ప్రజలు పడుతోన్న ఇబ్బందుల్ని టీవీ9 ప్రముఖంగా ప్రసారం చేయడం అభినందనీయమన్నారు. అంతేకాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముంపు కాలనీల్లో టీవీ9 కవరేజ్ పై స్పందించిన ఆమె, అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లేలా గూడ చెరువు వరదను అపలేమని చెప్పారు. అలా అడ్డుకట్ట వేసి ఆపితే పెద్ద చెరువుకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. చెరువు క్రింద ఉన్న కాలనీలను ఖాళీ చేయించి…పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. “ప్రజలు ఆందోళన చెందొద్దు…భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చెరువుల పునరుద్ధరణ చేస్తాము” అని సబిత భరోసా ఇచ్చారు.