విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా యూనివర్సిటీస్ః మంత్రి సబితా
తెలంగాణలో విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రయివేటు యూనివర్సిటీల ప్రతిపాదనలను తీసుకువచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ప్రయివేటు యూనివర్సిటీస్ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు.
తెలంగాణలో విద్యార్థుల డిమాండ్‌కు అనుగుణంగా ప్రయివేటు యూనివర్సిటీల ప్రతిపాదనలను తీసుకువచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ర్టంలో ప్రైవేటు యూనివర్సిటీలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ స్టేట్ ప్రయివేటు యూనివర్సిటీస్ బిల్లుపై శాసనసభలో చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబిత సమాధానమిచ్చారు.
దేశంలో ప్రాథమిక విద్యలో వందశాతం స్థూల జాతీయ నమోదు ఉన్నప్పటికీ, మాధ్యమిక, ఉన్నత విద్యలో ఇది కొంత క్షీణించిందని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున మరిన్ని యూనివర్సిటీలు రావల్సిన అవసరముందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా రంగం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిందన్న మంత్రి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యలో ప్రయివేట్ యూనివర్సిటీల అవసరం ఉందని భారత ప్రభుత్వం కూడా గుర్తించిందన్నారు. యూనివర్సిటీలతో పాటు డీమ్డ్ యూనివర్సిటీల ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఆగస్టు 8, 2020 నాటికి మన దేశంలో 950 యూనివర్సిటీలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 53 సెంట్రల్ యూనివర్సిటీలు, 412 స్టేట్ యూనివర్సిటీలు, 124 డీమ్డ్ యూనివర్సిటీలు, 361 ప్రైవేటు యూనివర్సిటీలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
రాష్ర్టంలో ఉన్నత విద్యను పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్న మంత్రి సబితా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యను, టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గురుకులాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా 959 గురుకులాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.
తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగడంతో, మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల వెళ్లకుండా ఇక్కడే ప్రయివేటు యూనివర్సిటీల ప్రతిపాదనను తీసుకొచ్చామన్నారు. తెలంగాణలో ప్రయివేటు యూనివర్సిటీలకు సంబంధించి మొత్తం 16 ప్రతిపాదనలు వచ్చాయని గుర్తు చేశారు. వీటిలో 8 ప్రతిపాదనలకు ప్రభుత్వం ఒకే చెప్పిందని మంత్రి.. ఇందులో 5 ప్రయివేటు యూనివర్సిటీలకు ఇప్పటికే ఆమోదం తెలిపామన్నారు. మిగతా మూడింటికి త్వరలోనే నాణ్యత ప్రమాణాలను పరిశీలించి అనుమతులివ్వడం జరుగుతుందన్నారు. ప్రయివేటు యూనివర్సిటీల స్థానంలో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని మంత్రి సబిత పేర్కొన్నారు. అలాగే, రాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం లేదన్నారు. త్వరలోనే వీసీలను, అధ్యాపకులను భర్తీ పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే పోస్టుల భర్తీ ప్రక్రియకు అనుమతులు మంజూరు చేశామన్నారు.