10 వేల వరద సాయం ఆపినోళ్లు… పాతిక వేలు ఇస్తారా…బల్దియా పోరులో మంత్రి కేటీఆర్ విమర్శలు

|

Nov 21, 2020 | 7:43 PM

10 వేల వరద సాయం ఆపినోళ్లు... పాతిక వేలు ఇస్తారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు...

10 వేల వరద సాయం ఆపినోళ్లు... పాతిక వేలు ఇస్తారా...బల్దియా పోరులో మంత్రి కేటీఆర్ విమర్శలు
Follow us on

Minister KTR Campaign : 10 వేల వరద సాయం ఆపినోళ్లు… పాతిక వేలు ఇస్తారా అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్‌. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్ల టీఆర్‌ఎస్‌ కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ డ్రామాలు నడవడానికి ఇదేమీ అయామకపు అహ్మదాబాద్‌ కాదని, హుషారైన హైదరాబాద్‌ అని మాటల తూటాలను సందించారు.

గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి విజయఢంకా మోగించాామని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఇదే నియోజకవర్గం నుంచే పార్టీ ప్రచారాన్ని ప్రాంరంభించినట్లుగా తెలిపారు. బల్దియా పోరులో ప్రచారాన్ని ప్రారంభించారాయన. డిసెంబర్‌ 1న జరిగే పోలింగ్‌ ద్వారా ఓల్డ్‌ అల్లాపూర్‌ కార్పొరేటర్‌గా సబీనా, మూసాపేట కార్పొరేటర్‌గా శ్రవణ్‌కుమార్‌ ఎన్నిక కాబోతున్న సందర్భంగా అందరూ చప్పట్లతో హర్షధ్వానాలు తెలపాలన్నారు.

సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. హిందువులు, ముస్లింలు కలిసి ఉంటే బీజేపీ వాళ్లకు నచ్చడం లేదని, ఏదో ఒక రకంగా సమస్యలు సృష్టించి ఆ మంటల్లో చలి కాచుకోవాలని చూస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు‌. హైదరాబాద్‌ ఆగమైతే… తెలంగాణ ఆగమవుతుందని వ్యాఖ్యానించారు.