AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంబేడ్క‌ర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా?.. : మంత్రి కేటీఆర్

భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను కాంగ్రెస్ పార్టీ అవ‌మానించిందని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‌గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు...

అంబేడ్క‌ర్‌ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా?.. : మంత్రి కేటీఆర్
Sanjay Kasula
|

Updated on: Sep 16, 2020 | 4:02 PM

Share

Minister KTR Questioned Congress :  భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను కాంగ్రెస్ పార్టీ అవ‌మానించిందని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు. ‌గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనులు, మౌళిక వసతులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రస్తావించారు. త‌మ‌కు అంబేడ్క‌ర్ పై గౌర‌వం లేద‌ని భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడటం.. అది వారికే చెల్లుతుంద‌న్నారు. అంబేడ్క‌ర్‌ను అవ‌మానించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.

1952లో జ‌రిగిన తొలి ఎన్నిక‌ల్లో అంబేడ్క‌ర్ ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. అంబేడ్క‌ర్‌ను పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టనివ్వ‌కుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింద‌ని అన్నారు. అంబేడ్క‌ర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌ని కాంగ్రెస్ నేత‌లు.. ఆయ‌న గురించి మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు.

అంబేడ్క‌ర్‌ను గౌర‌విస్తున్నాం కాబ‌ట్టే.. బోర‌బండ‌లో సెంట‌ర్ ఫ‌ర్ ద‌ళిత్ స్ట‌డీస్ వ‌ద్ద దేశంలోనే అతి పెద్ద విగ్రహాన్ని 28 ఫీట్ల ఎత్తులో పెట్టామన్నారు. ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ 125 ఫీట్ల ఎత్తులో అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌ను అనుస‌రించి ఉంటే ఆ పార్టీ ఎప్పుడో బాగుప‌డేదని ఎద్దేవ చేశారు. త‌మ పార్టీ అంబేడ్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా ముందుకెళ్తుందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Follow Us