తెలంగాణతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీది ప్రత్యేక అనుబంధం..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి హరీష్ రావు అన్నారు. తనకు ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు...

తెలంగాణతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీది ప్రత్యేక అనుబంధం..
Follow us

|

Updated on: Sep 01, 2020 | 1:48 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం దేశానికి ,తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని మంత్రి హరీష్ రావు అన్నారు. తనకు ప్రణబ్ ముఖర్జీతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 2004 హిమాచల్ ప్రదేశ్‌లో తొలిసారి ప్రణబ్ ముఖర్జీని కలిసినట్లుగా చెప్పారు. 2004 యూపీఏలో చేరేందుకు సీఎం కేసీఆర్‌తో నేను కూడా ప్రణబ్ ముఖర్జీ కలవడానికి వెళ్ళాను అని అప్పటి విషయాన్ని మంత్రి గుర్తు చేసుకున్నారు.

యూపీఏ ప్రభుత్వం వస్తే మీరు ఇంట్లో కూర్చుండి తెలంగాణ తీసుకోవచ్చు అని ఆయన అప్పుడు అన్న మాటలను మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రణబ్‌ రాష్ట్రపతి అయ్యాక తెలంగాణ ఏర్పాటుపై సంతకం పెట్టారని మంత్రి హరీష్ అన్నారు.

రాజకీయంలో ఎంతో అపార అనుభవం ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ. ఎంతో క్లిష్ట సమయంలో పార్టీకి ప్రభుత్వంకు అండగా ఉన్న వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ అని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్న, ఆయన కుటుంబంకు నా ప్రగాఢ సానుభూతి తెలువుతున్నట్టుగా వెల్లడించారు మంత్రి హరీష్ రావు.