కరోనా వైరస్ వ్యాక్సీన్ పై ఇక ఆశలొద్దు, నిపుణుల వార్నింగ్
కరోనా వైరస్ వ్యాక్సీన్ పై ఇక 'తప్పుడు ఆశలు' పెట్టుకోరాదని నిపుణులు హెచ్ఛరిస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం ప్రబలంగా ఉన్న కోవిడ్-19 పాండమిక్ లో వ్యాక్సీన్ల పాత్ర ఏదీ ఉండదని, సమీప భవిష్యత్తులో దీటైన, సురక్షితమైన వ్యాక్సీన్ ఉండదనే..

కరోనా వైరస్ వ్యాక్సీన్ పై ఇక ‘తప్పుడు ఆశలు’ పెట్టుకోరాదని నిపుణులు హెచ్ఛరిస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం ప్రబలంగా ఉన్న కోవిడ్-19 పాండమిక్ లో వ్యాక్సీన్ల పాత్ర ఏదీ ఉండదని, సమీప భవిష్యత్తులో దీటైన, సురక్షితమైన వ్యాక్సీన్ ఉండదనే భావించాలని వారు అంటున్నారు. ఈ మేరకు వారు ప్రధాని మోదీకి ఓ లేఖ కూడా రాశారు. రాబోయే రోజుల్లో పాండమిక్ ని నశింపజేసే వ్యాక్సీన్ వస్తుందన్న ఆశను వదులుకోవాలని అన్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఎపిడెర్మాలజిస్ట్స్ ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ వైరస్ తో దేశం ఏడు నెలలుగా నెట్టుకొస్తోందన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. వైరస్ ని పూర్తి నశింపజేసే టీకా వచ్చినప్పుడే దాన్ని తీసుకోవాలి.. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ఇప్పటివరకు నోరు మెదపలేదు అని నిపుణులు పేర్కొన్నారు. కరోనా వైరస్ ని కంట్రోల్ చేయాలంటే లాక్ డౌనే పరిష్కారమనే యోచన కూడా సరికాదన్నారు.
కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్స్ లేనిచోట్ల క్లస్టర్ ఆంక్షల విధింపు అంశాన్ని పరిశీలించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు. దశలవారీగా స్కూళ్లను, విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని, ఎకానమీ పునరుధ్దరణపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచించారు. సోమవారం ఒక్కరోజే ఇండియాలో 80 వేల కరోనా కేసులు నమోదైన విషయాన్ని వారు పేర్కొన్నారు.



