AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

తమిళనాడులో ఆలయాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి ఆలయాలకు మినహాయింపు రావడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. దాదాపు అయిదు నెలల తర్వాత దేవదేవుళ్ల దర్శనభాగ్యం లభిస్తుండటంతో ప్రతీ ఆలయానికి భక్తులు విపరీతంగా వచ్చారు.

తమిళనాడులో ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Balu
|

Updated on: Sep 01, 2020 | 1:44 PM

Share

తమిళనాడులో ఆలయాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి ఆలయాలకు మినహాయింపు రావడంతో ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలు భక్తుల కోసం తెరచుకున్నాయి.. దాదాపు అయిదు నెలల తర్వాత దేవదేవుళ్ల దర్శనభాగ్యం లభిస్తుండటంతో ప్రతీ ఆలయానికి భక్తులు విపరీతంగా వచ్చారు.. ఇప్పటికే కరోనా నిబంధనలలో భాగంగా అన్ని ప్రధాన ఆలయాలను పూర్తిగా అధికారులు శానిటైజ్‌ చేశారు.. ఇక మదురై ఆలయంలో మీనాక్షి అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు పడిగాపులు కాస్తున్నారు. పలు ముఖ్య ఆలయాలకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు గుంపులు గుంపులుగా దర్శనాలకు రావద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు.. భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే అధికారుల హెచ్చరికలను, సూచనలను భక్తులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.. మాస్కులు లేకుండానే గుడిలోకి వస్తున్నారు.. దర్శనాలకు ఎగబడుతున్నారు.. వారిని అదుపు చేయడం పోలీసు సిబ్బందికి కష్టమవుతోంది.. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరాన్ని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
సినిమాల చుట్టూ వివాదాలు..! అయినా జైకొట్టిన ప్రేక్షకులు
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీ పేరు మర్చిపోయి.. స్టేజ్ మీద అడ్డంగా బుక్కైన రామ్‌చరణ్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
యంగ్ బ్యూటీలకు ఏ మాత్రం తక్కువ కాదంటున్న సీనియర్ హీరోయిన్
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
85 ఏళ్ల వయసులో జిమ్‌లో చెమటోడుస్తున్న సీనియర్ నటుడు
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
5 సినిమాలతో బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
రాత్రి మెలకువగా ఉండేవాళ్లు జీనియస్‌లు! ఏది నిజం
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడానికి మళ్లీ రెడీ అవుతున్న బాలయ్య
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!
పాలిటెక్నిక్ విద్యార్థిని నిర్బంధించిన ఫారెస్ట్ అధికారులు!