ప్రేయసి తల్లి తమ పెళ్లికి నో చెప్పింద‌ని, రోడ్డుపై వాహ‌నాల‌ను

ప్రేమ‌సి తల్లి తమ వివాహానికి అంగీక‌రించ‌లేద‌న్న‌ కోపంలో ఓ యువకుడు ఫ్రెండ్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. ఇద్దరూ కలిసి రోడ్డుపై భీక‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

ప్రేయసి తల్లి తమ పెళ్లికి  నో చెప్పింద‌ని, రోడ్డుపై వాహ‌నాల‌ను

Updated on: Aug 28, 2020 | 6:54 PM

ప్రేమ‌సి తల్లి తమ వివాహానికి అంగీక‌రించ‌లేద‌న్న‌ కోపంలో ఓ యువకుడు ఫ్రెండ్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. ఇద్దరూ కలిసి రోడ్డుపై భీక‌రంగా ప్ర‌వ‌ర్తించారు. క‌నిపించిన‌ ఆటోలను, కార్లను, టూ వీల‌ర్‌ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటన పూణెలో బుధవారం జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. శరత్‌ తుకారామ్‌ పటోల్‌ అనే వ్య‌క్తి బిద్వేవాడికి చెందిన ఓ యువతి గత కొన్ని సంవత్సరాలుగా ల‌వ్‌లో ఉన్నారు. ఈ క్ర‌మంలో బుధవారం ఇద్దరి మ్యారేజ్‌ విషయం మాట్లాడటానికి అతడు ప్రేయ‌సి ఇంటికి వెళ్లాడు‌. ప్రియురాలిని తన కిచ్చి వివాహం జరిపించాలని ఆమె తల్లిని అడిగాడు. ఇందుకు ఆమె కుద‌ర‌ద‌ని చెప్పింది.

దీంతో ఆగ్రహించిన అతడు ఫ్రెండ్‌తో కలిసి ఇంటి చుట్టు ప్రక్కల నిలిపి ఉంచిన వాహనాలపై దాడిచేశారు. కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశాడు. దీంతో ప‌రిస‌ర ప్రాంతాల వారు పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడకు చేరుకున్న పోలీసులు యువతిని, ఆ ఇద్దరు యువకుల్ని కూర్చోబెట్టి పూర్తి వివ‌రాలు తెలుసుకున్నారు. యువకులు తామే త‌ప్పు చేశామని ఒప్పుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరినీ కోర్టులో హాజరు పరిచారు.

Also Read :

ఈ గొర్రె రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు