ప్రయాణికుల బస్సు నడిపిన తొలి మహిళ.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన పూజాదేవి..

అకాశంలో సగం.. అవకాశంలో సగం అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంత కాలం బయటి ప్రపంచం చూడని జమ్మూ కశ్మీర్ మహిళలు ముందుకు దూసుకువస్తున్నారు. ఏకంగా ప్రజా రవాణాకు చెందిన ఓ బస్సును నడిపి చరిత్ర సృష్టించారు.

ప్రయాణికుల బస్సు నడిపిన తొలి మహిళ.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్‌కు చెందిన పూజాదేవి..

Edited By:

Updated on: Dec 26, 2020 | 3:36 PM

అకాశంలో సగం.. అవకాశంలో సగం అన్నట్లు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంత కాలం బయటి ప్రపంచం చూడని జమ్మూ కశ్మీర్ మహిళలు ముందుకు దూసుకువస్తున్నారు. ఏకంగా ప్రజా రవాణాకు చెందిన ఓ బస్సును నడిపి చరిత్ర సృష్టించారు. జమ్ముకశ్మీర్‌లో తొలిసారి ఒక మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి ఈ ఘనత సాధించారు. గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును నడుపుకుంటూ వెళ్లారు.

అయితే, కథువా జిల్లాకు చెందిన పూజాదేవికి వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కుమారుడిని వెంటపెట్టుకుని గురువారం తొలిసారి జమ్ము నుంచి కథువా వరకు ప్రయాణికుల బస్సును నడిపారు. బస్సు డ్రైవర్‌ కావాలన్నది తన చిరకాల వాంఛ అని, అదీ ఇప్పుడు నెరవేరిందని పూజా దేవి చెప్పారు. దీని కోసం తాను ఎంతో శ్రమించినట్లు వెల్లడించారు. మామ రాజేంద్ర సింగ్‌ నుంచి లారీ నడపడం నేర్చుకున్నట్లు వివరించారు. పేదరికం వల్ల చదువుకొనసాగించలేకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు. మరోవైపు, మగవారితో సమానంగా ప్రయాణికుల బస్సు డ్రైవర్‌ వృత్తిని పూజా దేవిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌తోపాటు పలువురు నేతలు, స్థానికులు, తోటి డ్రైవర్లు అభినందించారు. ఈ మేరకు మంత్రి ట్విట్టర్ వేదికగా కేంద్ర మంత్రి వెల్లడించారు.

Follow Us