నేటి నుండి.. మేడారం మహా జాతర..!

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్త జనులు పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది. దాదాపు కోటి మంది భక్తులు వస్తారని ఒక అంచనా. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను […]

నేటి నుండి.. మేడారం మహా జాతర..!

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్త జనులు పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక సారి జరుగుతుంది.

దాదాపు కోటి మంది భక్తులు వస్తారని ఒక అంచనా. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు. 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట భక్తులు పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం ప్రారంభించారు. ఈ జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దది.

సుప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వేప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.

మొదటిరోజు: ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. రెండోవరోజు: ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. మూడవరోజు: ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గువరోజు: ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్- వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య మరో 10 రైళ్లు నడవనున్నాయి.

Click on your DTH Provider to Add TV9 Telugu