సముద్రంలోనూ కరోనా.. నౌకలో బందీలుగా 3700 మంది..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది.. 3711 మంది ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్‌ షిప్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 2,666 మంది ప్రయాణికులు కాగా 1,045 మంది సిబ్బంది. యొకొహామా తీరానికి చేరిన ఈ నౌకను జపాన్‌ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. వారందరికీ.. వైద్య పరీక్షలు చేసే వరకు వారిని […]

సముద్రంలోనూ కరోనా.. నౌకలో బందీలుగా 3700 మంది..!

కరోనా మహమ్మారి చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది.. 3711 మంది ప్రయాణిస్తున్న జపాన్‌కు చెందిన డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్‌ షిప్‌లో ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. వీరిలో 2,666 మంది ప్రయాణికులు కాగా 1,045 మంది సిబ్బంది. యొకొహామా తీరానికి చేరిన ఈ నౌకను జపాన్‌ ప్రభుత్వం అక్కడే నిలిపి ఉంచింది. దీంతో ప్రయాణికులంతా 24గంటలుగా అందులోనే ఉండిపోయారు. వారందరికీ.. వైద్య పరీక్షలు చేసే వరకు వారిని బయటకు వదిలేది లేదని అధికారులు తెలిపారు.

వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. హాంగ్‌కాంగ్‌కు చెందిన 80 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు గుర్తించారు. ఇటీవల ఇదే నౌకను ఒకినావా పోర్టు తీరంలోనూ ఆపడం గమనార్హం. మరోవైపు కరోనా వ్యాప్తి చెందకుండా జపాన్‌ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. చైనాతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించింది.

Click on your DTH Provider to Add TV9 Telugu