మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ అరెస్ట్
రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అడిషినల్ కలెక్టర్ నగేశ్ సహా నర్సాపూర్ ఆర్డీవో అరుణ, తహశీల్దార్ సత్తార్, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసిన మెదక్ జిల్లా అడిషినల్ కలెక్టర్ నగేశ్ సహా నర్సాపూర్ ఆర్డీవో అరుణ, తహశీల్దార్ సత్తార్, నగేశ్ బినామీ జీవన్‌గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. మెదక్ మండలం మాచవరంలోని అడిషనల్ కలెక్టర్ క్యాంపు ఆఫీసులో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సోదాలు చేశారు. అనంతరం అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతనన్నకు మెదక్ జిల్లా చిప్పలతుర్తిలో 112 ఎకరాల ల్యాండ్ ఉంది. దీనికి సంబంధించి ఎన్‌వోసీ ఇవ్వాలని మూర్తి ఇటీవల అడిషినల్ కలెక్టర్ నగేశ్‌ను ఆశ్రయించారు. ఎన్‌వోసీ ఇస్తాను కానీ..తనకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు లంచం ఇవ్వాలని అదనపు కలెక్టర్ కోరారు. ఇప్పటికే రూ.40లక్షల డబ్బు తీసుకున్న ఈ అవినీతి అధికారి.. మరో రూ.72లక్షల కోసం 5 ఎకరాల భూమిని తన బినామీ జీవన్‌గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలలో సదరు రైతు అధికారులకు కంప్లైంట్ చేయడంతో, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేశారు. ఈ ఉదయం నుంచి సోదాలు నిర్వహించి తాజాగా నగేశ్ సహా పలువురిని అరెస్ట్ చేశారు.




