పుణేలో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలో రసాయన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుర్‌కుమ్బ్‌లోని ఎమ్‌ఐడీసీ ప్రాంతంలోని కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి..

పుణేలో భారీ అగ్నిప్రమాదం
Follow us

|

Updated on: May 22, 2020 | 4:19 PM

మహారాష్ట్రలోని భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలో రసాయన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుర్‌కుమ్బ్‌లోని ఎమ్‌ఐడీసీ ప్రాంతంలోని కెమికల్‌ ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా నల్లటి దట్టమైన పొగ కమ్మేసింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో మంటలు ఎగసిపడటంతో భయాందోళన చెందారు స్థానికులు. ఎగిసిపడుతున్న మంటలను అదుపలోకి తీసుకొచ్చేందుకు ఐదు అగ్నిమాక వాహనాలు రంగంలోకి దిగాయి. భారీగా చెలరేగుతున్న మంటలు సమీపంలోని ఇతర ఫ్యాకర్టీలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్ అనంతరం తెరుచుకున్న రెండవ రోజునే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. గ్యాస్‌, బాయిలర్‌ వదిలే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా… ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.