‘సినిమా చూసేటప్పుడు మాస్క్ తప్పనిసరి’

|

Oct 01, 2020 | 11:38 PM

సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కమల్ జ్ఞాన్‌చందానీ తెలిపారు. తినేటప్పుడు మాత్రం మాస్కులు అవసరం లేదన్న ఆయన..

సినిమా చూసేటప్పుడు మాస్క్ తప్పనిసరి
Follow us on

Masks will be mandatory: అన్‌లాక్‌ 5.0లో భాగంగా 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో సినిమా థియేటర్లను తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లు మినహాయించి మిగిలిన అన్ని చోట్లా అక్టోబర్ 15 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో మల్టీప్లక్స్ అసోసియేషన్ అఫ్ ఇండియా డైరెక్టర్, పీవీఆర్ సినిమాస్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ మీడియాతో మాట్లాడారు.

”కేంద్రం తీసుకున్న ఈ మూవ్‌ను స్వాగతిస్తున్నాం. థియేటర్ల రీ-ఓపెనింగ్ విషయంపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపాం. ప్రస్తుతానికి తమిళనాడు, మహారాష్ట్ర అక్టోబర్ 31 వరకు థియేటర్లు తెరిచే ప్రసక్తి లేదు. నవంబర్ మొదటి వారానికి దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటాయని ఆశిస్తున్నా. ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో థియేటర్లకు అనుమతించిన ప్రభుత్వం.. పరిస్థితుల బట్టి 6-8 వారాల తర్వాత కెపాసిటీపై పునరాలోచన చేస్తామని చెప్పింది” అని కమల్ జ్ఞాన్‌చందానీ పేర్కొన్నారు.

కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని కమల్ జ్ఞాన్‌చందానీ తెలిపారు. తినేటప్పుడు మాత్రం మాస్కులు అవసరం లేదన్న ఆయన.. ప్రతీ వ్యక్తికి.. వ్యక్తి మధ్య ఖాళీ సీట్లు ఉంటాయన్నారు. కస్టమర్లు టికెట్లతో పాటు ఆహారం, పానీయాలను కొనుగోలు చేసేందుకు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామని అన్నారు. షో టైమింగ్స్ మధ్య చాలా గ్యాప్ ఉంటుందన్నారు. సోషల్ డిస్టెన్సింగ్ తప్పనిసరిగా అందరూ పాటించేలా చర్యలు తీసుకుంటామని కమల్ జ్ఞాన్‌చందానీ చెప్పుకొచ్చారు.

Also Read:

ఏపీ పింఛన్‌దారులకు శుభవార్త.. కొత్తగా 34,907 మందికి లబ్ది..

ఏపీ ప్రజలకు అలెర్ట్.. మరిన్ని స్పెషల్ ట్రైన్స్.. ఆగే స్టేషన్లు ఇవే!

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..