AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు… చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కొవిడ్ నియంత్రించాయి..!

అన్ని దేశాల్లో వైరస్ వికృతరూపం చూపిస్తోంది. మాయదారి రోగం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తుంది. మరోవైపు వ్యాక్సిన్ అభివృద్ధి దేశాలు నిమగ్నమయ్యాయి. తాజాగా కరోనా కట్టడిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెస‌స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు...  చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కొవిడ్ నియంత్రించాయి..!
Balaraju Goud
|

Updated on: Nov 28, 2020 | 6:22 PM

Share

చైనాలో పుట్టిన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. దాదాపు అన్ని దేశాల్లో వైరస్ వికృతరూపం చూపిస్తోంది. మాయదారి రోగం నుంచి ఎప్పుడు విముక్తి దొరుకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తుంది. మరోవైపు వ్యాక్సిన్ అభివృద్ధి దేశాలు నిమగ్నమయ్యాయి. తాజాగా కరోనా కట్టడిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెస‌స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప‌్ర‌పంచంలోని చాలా దేశాలు వ్యాక్సిన్ లేకుండానే కొవిడ్-19ను నియంత్రించాయ‌ని డబ్ల్యూహెచ్‌వో డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ అన్నారు. ఈ మ‌హమ్మారితో అన్ని దేశాలు వ్యాప్తి చెందిందని , కానీ అన్ని దేశాలు ఒకే ర‌కంగా ప్ర‌భావితం కాలేద‌ని ఆయ‌న చెప్పారు.

ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ‌న‌రుల‌తోనే కొవిడ్‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని చాలా దేశాలు నిరూపించాయ‌ని టెడ్రోస్ వెల్లడించారు. అయితే, కరోనా పరీక్షల నిర్వహణలో ప్రపంచ దేశాలన్ని ముందున్నాయ‌ని ఆయ‌న వెల్లడించారు. ఈ మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ డ‌బ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలకు ముందస్తు జాగ్రత్తలు సూచిస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెస్టులు పెంచాలని, ఇందుకోసం అవ‌స‌ర‌మైన ప‌రికరాలు కూడా అందించామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న కేసులు, మ‌ర‌ణాల‌లో 50 శాతం కేవ‌లం నాలుగు దేశాల‌లోనే న‌మోద‌య్యాయ‌ని ఆయన వివరించారు. ఇక, 70 శాతం పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు టాప్ 10 దేశాల్లోనే ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం వ్యాక్సిన్‌ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అందుబాటులోకి రానుందని టెడ్రోస్ విశ్వాసం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ.. కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

Follow Us