దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఒకటి రెండు కేసులతో మొదలైన కరోనా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసుల్లో భారత్ ను మూడో స్థానానికి తీసుకెళ్లింది. దాదాపు రెండు నెలలపాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించినా కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత ఎమాత్రం తగ్గలేదు. ప్రజల ఆర్థికస్థితిగతులనే కరోనా మార్చేసింది. దీంతో లాక్‌డౌన్ సడలింపులతో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రెట్టింపు అయ్యింది. కరోనా నుంచి తప్పించుకునేందుకు ఇక, జనమే స్వచ్ఛందంగా లాక్‌డౌన్ లో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు మరోసారి లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించాయి. తాజాగా మణిపూర్ సైతం మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వస్తున్నట్లు అధికారులు వెల్లడించింది. అత్యవసరాలకు మాత్రమే జనం బయటకు రావాలని సూచించింది ప్రభుత్వం. రాత్రి సమయంలో పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు.
Manipur to go under complete lockdown for 14 days, starting 2 pm tomorrow. #COVID19 #TV9News
— tv9gujarati (@tv9gujarati) July 22, 2020