ఢిల్లీలోని జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం!

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సమీపంలో పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తున్న ప్రజలపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. వివరాల్లోకెళితే.. సీఏఏకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి […]

ఢిల్లీలోని జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 30, 2020 | 7:03 PM

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం సమీపంలో పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తున్న ప్రజలపై ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. వివరాల్లోకెళితే.. సీఏఏకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు.

ఓ యువకుడు భారీ కాపలా ఉన్న రహదారిపై నడుస్తూ, తుపాకీని ఊపుతూ నిరసనకారుల వద్ద “యే లో అజాది, ఢిల్లీ పోలీస్ జిందాబాద్” అని కూడా అరుస్తూ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్‌ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీలో గత నెలలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.

[svt-event date=”30/01/2020,4:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]