మోదీ గారి వైఫ్‌కి..దీదీ గారి గిప్ట్

|

Sep 18, 2019 | 3:56 PM

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్‌ను కలిశారు. మోదీని కలిసేందుకు మమత ఢిల్లీకి ప్రయాణమవుతుండగా కోల్‌కతా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ వెళుతూ.. జశోద కూడా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా మోదీ సతీమణికి మమత ఒక చీరను బహుమతిగా ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. మమత ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆమె పలు విషయాలపై […]

మోదీ గారి వైఫ్‌కి..దీదీ గారి గిప్ట్
Mamata runs into PM Modi's wife, gifts her sari before boarding flight to meet him
Follow us on

ఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..ప్రధాని నరేంద్ర మోదీ సతీమణి జశోదాబెన్‌ను కలిశారు. మోదీని కలిసేందుకు మమత ఢిల్లీకి ప్రయాణమవుతుండగా కోల్‌కతా విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ వెళుతూ.. జశోద కూడా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు కొద్దిసేపు మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా మోదీ సతీమణికి మమత ఒక చీరను బహుమతిగా ఇచ్చినట్లు ఆమె సన్నిహితులు తెలిపారు. మమత ఈరోజు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆమె పలు విషయాలపై చర్చించే అవకాశముంది. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పశ్చిమ బెంగాల్‌ పేరు మార్పు వంటి అంశాలను లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.