మాస్క్ అలా కాదు.. ఇలా..

కరోనాకు సంకెళ్ళు వేయాలంటే ఇలా చేయండి అంటూ చెప్పింది. మాస్క్  ధరించడం ఎంత అవసరమో..ఆ మాస్కును ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలని అంటోంది.

  • Sanjay Kasula
  • Publish Date - 2:56 pm, Wed, 29 July 20
మాస్క్ అలా కాదు.. ఇలా..

మలైకా అరోరా.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరంలేదు. ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తుకు వచ్చేది ఆమె హాట్.. హాట్ అందాలు. ఎప్పుడు ఒంపు సొంపులు ఆరబోసే మలైకా అరోరా… ఈ మధ్య కొంత కొత్తగా మాట్లాడుతోంది. అందరికీ ఉపయోగపడే సలహాలు.. సూచనలు చేస్తోంది. సామాజిక బాధ్యతను గుర్తు చేస్తోంది.

ఆ మధ్య కరోనా నుంచి మనల్ని మనం ఎలా కాపాడు కోవాలో చెప్పింది. ప‌సుపు, ఆపిల్‌, అల్లం, వెనిగ‌ర్‌, పెప్పర్‌ని ఉప‌యోగించి త‌యారు చేసుకున్న క‌షాయం తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుందని వంటింటి వైద్యం చెప్పింది. ఈ చిట్కా పాటిస్తే క‌రోనా నుండి మ‌నం సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చని తెలిపింది.

అయతే ఇప్పుడు తాజాగా మరో సంగతి చెప్పింది. కరోనాకు సంకెళ్ళు వేయాలంటే ఇలా చేయండి అంటూ చెప్పింది. మాస్క్  ధరించడం ఎంత అవసరమో.. ఆ మాస్కును ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకోవాలని అంటోంది. మూతి, ముక్కును పూర్తిగా కవర్ చేసేలా మాస్క్ ఉండాలని చెప్పింది.  మాస్క్ ను ఇలా వినియోగిస్తున్నారని ఓ ఫోటోను విడుదల చేసింది. ఏది సరైన పద్దతో వివరించింది.

 

View this post on Instagram

 

Please wear a mask n wear it the correct way . Protect urself and others 🙏 @my_bmc

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on