“మహా” కరోనా.. కొత్తగా 3, 721 మందికి పాజిటివ్

|

Jun 22, 2020 | 10:37 PM

మహారాష్ట్ర లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 3, 721 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1,35,796 కి చేరువైంది.

మహా కరోనా.. కొత్తగా 3, 721 మందికి పాజిటివ్
Follow us on

మహారాష్ట్ర లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 3, 721 మందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 1,35,796 కి చేరువైంది. సోమవారం 62 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం 6,283 ప్రాణాలు కోల్పోయారు. ఇక, కరోనాను జయించి 67,706 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 61,793 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు 103 ల్యాబ్‌లు అందుబాటులో తీసుకువచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వీటిలో 60 ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుండగా, ప్రైవేట్‌ పరిధిలో 43 ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో మిలియన్‌లో సగటున 4,610మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. మహారాష్ట్రంలో 5,847మందికి నిర్వహిస్తున్నామని వెల్లడించింది. గత మూడు నెలలుగా 7,73,865 శ్యాంపిళ్లను పరీక్షించగా 1,32,075 శ్యాంపిళ్లు కరోనా పాజిటివ్‌ వచ్చాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంచామని స్పష్టం చేసింది.