AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మహా ‘ లో ఇక శివసేన ప్రభుత్వం ? కాంగ్రెస్, ఎన్సీపీలకూ భాగస్వామ్యం !

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పడే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఈ పార్టీ.. తన ప్రధాన డిమాండ్ అయిన పూర్తి స్థాయి సీఎం పదవిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కావచ్ఛునని భావిస్తున్నారు. సేన సీఎం పదవి దాదాపు ఖరారు కాగా.. కాంగ్రెస్, ఎన్సీపీ డిప్యూటీ సీఎం పదవులను పొందవచ్చు అలాగే సేన, ఎన్సీపీ 14 మంత్రి పదవుల చొప్పున, కాంగ్రెస్ పార్టీ 12 మినిస్టర్ బెర్తులను కోరుతున్నాయి. ఈ మూడు […]

' మహా ' లో ఇక శివసేన ప్రభుత్వం ? కాంగ్రెస్, ఎన్సీపీలకూ భాగస్వామ్యం !
Anil kumar poka
|

Updated on: Nov 15, 2019 | 11:51 AM

Share

మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం ఏర్పడే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. ఈ పార్టీ.. తన ప్రధాన డిమాండ్ అయిన పూర్తి స్థాయి సీఎం పదవిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కావచ్ఛునని భావిస్తున్నారు. సేన సీఎం పదవి దాదాపు ఖరారు కాగా.. కాంగ్రెస్, ఎన్సీపీ డిప్యూటీ సీఎం పదవులను పొందవచ్చు అలాగే సేన, ఎన్సీపీ 14 మంత్రి పదవుల చొప్పున, కాంగ్రెస్ పార్టీ 12 మినిస్టర్ బెర్తులను కోరుతున్నాయి. ఈ మూడు పార్టీల కనీస ఉమ్మడి కార్యక్రమం (కామన్ మినిమమ్ ప్రోగ్రామ్) .. రైతులు, యువజనుల సమస్యలపై దృష్టి పెట్టవచ్ఛునని తెలుస్తోంది. అంతేతప్ప.. హిందుత్వ అంశాల జోలికి ఈ ‘ కార్యక్రమం ‘ వెళ్లకపోవచ్చు. (ఇది సహజంగా కాంగ్రెస్ పరోక్ష డిమాండ్). కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ నేత శరద్ పవార్ తిరిగి రేపో, మాపో సమావేశం కానున్నారు.

వీర్ సావర్కర్ కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న శివసేన డిమాండును, ముస్లిములకు అయిదు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఎన్సీపీ డిమాండును ఈ పార్టీలు పరిష్కరించాల్సి ఉంది. ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సేన నేత సంజయ్ రౌత్ తన అస్వస్థతకు చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం.. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన అన్నట్టుగానే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.