Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..

|

Mar 16, 2020 | 2:13 PM

Madhya Pradesh Crisis: అనుకున్నట్లుగానే కరోనా తన ప్రభావం చూపించింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాధ్ ప్రభుత్వం ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. కరోనా కారణంగా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. కాగా, అంతకముందు… మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన నేడు ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనేలా చూడాలని  గవర్నర్ లాల్ జీ టాండన్.. స్పీకర్ ప్రజాపతికి లేఖ రాశారు. అయితే […]

Breaking: కరోనా ఎఫెక్ట్.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ 26 వరకు వాయిదా..
Follow us on

Madhya Pradesh Crisis: అనుకున్నట్లుగానే కరోనా తన ప్రభావం చూపించింది. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాధ్ ప్రభుత్వం ప్రస్తుతానికి గండం గట్టెక్కింది. కరోనా కారణంగా అసెంబ్లీని ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. కాగా, అంతకముందు…

మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొంటుందా అన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన నేడు ఫ్లోర్ టెస్టును ఎదుర్కొనేలా చూడాలని  గవర్నర్ లాల్ జీ టాండన్.. స్పీకర్ ప్రజాపతికి లేఖ రాశారు. అయితే దీనిపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన నిర్ణయమే తమకు శిరోధార్యమని కమల్ నాథ్ అంటున్నారు. 22 మంది రెబెల్ ఎమ్మెల్యేలను బీజేపీ బందీలుగా ఉంచిందని, అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నదే వారి ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టనివ్వండి.. అని సవాల్ చేసిన ఆయన.. తమ ప్రభుత్వం శాసన సభలో నెగ్గితీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. వీలైతే ఫ్లోర్ టెస్ట్ ను వాయిదా వేయాలని కోరుతున్నామన్నారు. అటు-హౌస్ బిజినెస్ లిస్టులో నేడు ఫ్లోర్ టెస్ట్ అన్న అంశం లేదని తెలిసింది. కాగా-అందరి కళ్ళూ 22 మంది రెబెల్ శాసన సభ్యులపైనే ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా ఈ పార్టీని వీడి బీజేపీలో చేరడంతో..ఆయనకు మద్దతుదారులైన వీరంతా ఎలాంటి చర్య చేపట్టబోతారోనని రాజకీయ పరిశీలకులు తర్జనభర్జన పడుతున్నారు.

For More News:

ఉగ్రవాదులకు భయాన్ని పరిచయం చేసిన కరోనా.. ఆ పనులకు ఫుల్‌‌స్టాప్..

కొత్త జంటలకు విలన్‌గా కరోనా.. భారీగా నమోదైన విడాకుల కేసులు..

ఐపీఎల్ నిర్వహణకు మరో ఐదు తేదీలు..?

రోజా ది గ్రేట్.. నాగబాబుకు మరోసారి షాక్..!

ఇండియాలో విజృంభిస్తున్న కరోనా.. దేశంలో నమోదైన కేసుల వివరాలు ఇవే..

కరోనా టైమ్: శానిటైజర్ల, మాస్క్‌ల ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

గుడ్ న్యూస్.. ఎయిడ్స్ మందులతో కరోనా నయం.. సీఎం కంగ్రాట్స్..