‘ధోనికి భారతరత్న ఇవ్వాలి’..

|

Aug 17, 2020 | 1:43 PM

దేశంలోనే అత్యున్నత పురస్కారం అయిన 'భారతరత్న' అవార్డును మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.

ధోనికి భారతరత్న ఇవ్వాలి..
Follow us on

Bharat Ratna For MS Dhoni: దేశంలోనే అత్యున్నత పురస్కారం అయిన ‘భారతరత్న’ అవార్డును మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనికి ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీసీ శర్మ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. దీనికి అభిమానులు కూడా మద్దతు ఇస్తున్నారు. ” విదేశాల్లో అద్భుతమైన విజయాలు అందించి భారత్ క్రికెట్‌ను గర్వించేలా చేశాడు. అంతర్జాతీయంగా ఇండియన్ క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేర్చాడు. ఇలా భారత్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగిన ధోనికి ‘భారత్ రత్న’ ఇచ్చి సత్కరించాలి” అని ఎమ్మెల్యే పీసీ శర్మ ట్విట్టర్ వేదికగా కోరారు.

కాగా, భారత్ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోని ఆగష్టు 15న తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 1983 తర్వాత ఇండియాకు వన్డే ప్రపంచకప్ సాధించడమే కాకుండా.. 2007లో టీ20 వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలోనే భారత్ గెలుచుకుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు వెన్నంటే ఉండి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. వన్డేలు, టీ20లు ఆడుతూ 2015 ప్రపంచకప్‌, 2016 టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌ వరకు.. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ వరకు జట్టును నడిపించాడు. అటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో కూడా భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు.

Also Read:

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!