మదనపల్లె మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!

Madanapalle Incident: మదనపల్లి జంట హత్యల కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు కూతుళ్లిద్దరికి...

మదనపల్లె మరణాలపై మరో కోణం.. చెల్లి ఆత్మ కోసం అక్క ఆరాటం.. మిస్టరీగా మారుతున్న డబుల్ మర్డర్.!

Updated on: Jan 26, 2021 | 1:01 PM

Madanapalle Incident: మదనపల్లె జంట హత్యల కేసులో మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు కూతుళ్లిద్దరికి దెయ్యం పట్టిందని పద్మజ ఇద్దరు మంత్రగాళ్లతో నాలుగు రోజుల పాటు ఇంట్లో క్షుద్రపూజలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాకింగ్‌కి వెళ్ళినపుడు ఎవరో మంత్రించిన నిమ్మకాయలను తమ పిల్లలు తొక్కారని.. అప్పటి నుంచి వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందంటూ పద్మజ చెప్పేదట. అందులో భాగంగానే పిల్లలిద్దరికీ తాంత్రికుడుతో తాయిత్తులు కట్టించి.. మెడలో రుద్రాక్ష మాలలు వేయించిందట.

ఇదిలా ఉంటే చిన్న కూతురు సాయి దివ్యకు దెయ్యం పట్టిందని, అందుకు విరుగుడుగా పూజలు చేయాలని పెద్ద కూతురు అలేఖ్య చెప్పేదని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఇందులో భాగంగానే దివ్య తలపై దంబెల్‌తో అక్క ఆలేఖ్య కొట్టి చంపిందట. అనంతరం ఆమె మృతదేహం చుట్టూ పద్మజ, పురుషోత్తం నగ్నంగా పూజలు చేశారు. ఆ తర్వాత చనిపోయిన చెల్లి ఆత్మను తిరిగి తెస్తానంటూ తన ప్రాణం తీయాలని అక్క అలేఖ్య తల్లిని కోరింది. దీనితో నవధాన్యలు పోసిన కలసాన్ని ఆలేఖ్య నోట్లో పెట్టి.. ఆమెను తల్లి కిరాతకంగా హతమార్చింది. అటు సీసీ ఫుటేజ్‌లో తాంత్రికుల రాకపోకలకు సంబంధించిన విజువల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాటిని పోలీసులు రహస్యంగా ఉంచారు.