ట్రంప్ డ్రెస్ మారింది..

|

Nov 08, 2020 | 11:44 AM

DONALD TRUMP : అమెరికా అధ్యక్షపదవి రేసులో.. డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్తుగా ఓడిపోయారు. దాదాపు 60 ఎలక్టోరల్‌ ఓట్ల తేడాతో మట్టికరిచారు ట్రంప్‌. ప్రత్యర్థి బైడెన్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆయన 2016లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి.. ఓటమి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అయితే ఆయన ఓడిన తర్వాత  పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఓడిన ట్రంప్‌ను స్వేత సౌదం నుంచి గెంటేస్తామని ఒకరు ప్రకటిస్తే… ఇక ఆయన పనైపోయింది.. అంటూ ప్రపంచ దేశాలు వివిధ రకాలుగ […]

ట్రంప్ డ్రెస్ మారింది..
Follow us on

DONALD TRUMP : అమెరికా అధ్యక్షపదవి రేసులో.. డొనాల్డ్‌ ట్రంప్‌ చిత్తుగా ఓడిపోయారు. దాదాపు 60 ఎలక్టోరల్‌ ఓట్ల తేడాతో మట్టికరిచారు ట్రంప్‌. ప్రత్యర్థి బైడెన్‌ చేతిలో ఓటమి చవిచూశాడు. ఆయన 2016లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి.. ఓటమి వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

అయితే ఆయన ఓడిన తర్వాత  పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఓడిన ట్రంప్‌ను స్వేత సౌదం నుంచి గెంటేస్తామని ఒకరు ప్రకటిస్తే… ఇక ఆయన పనైపోయింది.. అంటూ ప్రపంచ దేశాలు వివిధ రకాలుగ స్పందిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జర్మనీలోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వింత నిర్ణయం తీసుకుంది. తమ మ్యూజియంలోని ట్రంప్ మైనపు విగ్రహాన్ని చెత్తబుట్టలో పడేసింది.

ఇప్పుడు ఇదే బాటలో లండన్ టుస్సాడ్స్ మ్యూజియం చేరింది. ప్రెసిడెంట్ ట్రంప్ మైనపు విగ్రహానికి డ్రెస్ మార్చేశారు. సూటు.. బూటు ధరించి ఉన్న విగ్రహాన్ని మార్చి..  గోల్ఫ్ ఆడేందుకు రెడీ అయిన ట్రంప్ వేషంలో కొత్తగా డిజైన్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అధికారం ఉన్నప్పుడు జేజేలు కొట్టినవారు పవర్ పోయేసరికి పక్కన పడేయటం సహజమే అని విశ్లేషకులు అంటున్నారు.