ఎం.ఫిల్ చేసి, మానేసి, హిజ్ బుల్ చీఫ్ గా అవతారమెత్తి !
జమ్మూకాశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ గా జుబేర్ వని అనే యువకుడ్ని ఈ ఉగ్రవాద సంస్థ నియమించింది. డెహ్రాడూన్ కాలేజీ నుంచి ఎం.ఫిల్ చేసి మధ్యలో మానేసిన ఈ 31 ఏళ్ళ వ్యక్తి 2018 లో ఈ సంస్థలో చేరాడట.
జమ్మూకాశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ గా జుబేర్ వని అనే యువకుడ్ని ఈ ఉగ్రవాద సంస్థ నియమించింది. డెహ్రాడూన్ కాలేజీ నుంచి ఎం.ఫిల్ చేసి మధ్యలో మానేసిన ఈ 31 ఏళ్ళ వ్యక్తి 2018 లో ఈ సంస్థలో చేరాడట. గత ఆదివారం భద్రతాదళాల ఎన్ కౌంటర్ లో మరణించిన ఈ సంస్థ కమాండర్ సైఫుల్లా స్థానే జుబేర్ ని నియమించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనంత నాగ్ జిల్లాలో ఇతని కుటుంబం ఉంటోంది. అయిదుగురు పిల్లల్లో జుబేర్ ఒకడే విద్యావంతుడు. ప్రస్తుతమున్న సీనియర్ మోస్ట్ ఉగ్రవాదుల్లో ఒకడైన అష్రాఫ్ మౌల్వీ అలియాస్ అష్రాఫ్ ఖాన్ కిడ్నీ సంబంధ సమస్యతో బాధ పడుతుండడంతో ఇక అతని తరువాత ఈ పిల్ల ఎం.ఫిల్ డ్రాపౌటే సీనియర్ అయ్యాడు. జమ్మూ కాశ్మీర్ లో చాలామంది యువకులు ఉగ్రవాదంవైపు ఆకర్షితులై కొంతకాలం అందులో పని చేసి మళ్ళీ జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని సైనిక వర్గాలు తెలిపాయి.