Andhra Pradesh: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మద్యం షాపుల పనివేళలు పొడిగింపు

|

Jan 17, 2022 | 9:48 PM

ఏపీ సర్కార్ మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: మందుబాబులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మద్యం షాపుల పనివేళలు పొడిగింపు
Liquor Shops
Follow us on

ఏపీ సర్కార్ మందుబాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది.  రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల పనివేళలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో గంట పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  రాత్రి 10 వరకు మద్యం దుకాణాల నిర్వహణ ఉంటుందని ఆబ్కారీ శాఖ స్ఫష్టం చేసింది. బేవరేజెస్ కార్పొరేషన్  దుకాణాలు రాత్రి 10 వరకు నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. విక్రయ ఖాతాల నిర్వహణకు మరో గంట సమయం పెంచినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

మద్యం విషయంలో ఏపీ ఎక్సైజ్ శాఖ ఈ మధ్యకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల  రాష్ట్రంలో మద్యంపై పన్ను రేట్లలో మార్పులు చేసింది సర్కార్. వ్యాట్‌తో పాటు స్పెషల్‌ మార్జిన్‌, అడిషనల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని క్రమబద్ధీకరించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్‌ఎల్‌) రకం మద్యంపై 5 శాతం నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గించింది. బీర్లపై వ్యాట్ 10 నుంచి 20 శాతం, స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సయిజ్ డ్యూటీ 36 శాతం తగ్గనుంది. అంతేకాదు  అన్ని ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ అమ్మాలని గవర్నమెంట్ నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యం స్మగ్లింగ్‌ అరికట్టేందుకే.. ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి స్కూల్స్​లో ఇంగ్లీషు మీడియం

ఏపీలో పాఠశాలలకు సెలవుల కొనసాగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారీటీ