శ్రీశైలం ఫారెస్ట్‌లో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. దర్యాప్తు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు

ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీశైలం ఫారెస్ట్‌లో పరిధిలోని కర్నూలు జిల్లా శైలం మండలం సుండిపెంట ఈద్గా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

శ్రీశైలం ఫారెస్ట్‌లో అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి.. దర్యాప్తు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 27, 2020 | 6:17 PM

ఓ చిరుత పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శ్రీశైలం ఫారెస్ట్‌లో పరిధిలోని కర్నూలు జిల్లా శైలం మండలం సుండిపెంట ఈద్గా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బండ ప్రాంతంలో చిరుత కళేబరం పడి వుండడం అనేక అనుమానాలకు దారి తీసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. చిరుతను అడవి జంతువులు చంపాయా అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే, రేసు కుక్కల దాడిలో చిరుత చనిపోయినట్లుగా అటవీశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. చిరుత పులి వయసు సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల లోపు ఉండవచ్చని అంచనా వేసి అధికారులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం చేసిన అనంతరం పూర్తి వివరాలను తెలుస్తాయని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు.