హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం.. జల్‌పల్లి కార్గో రోడ్డులో సంచరిస్తున్నట్లు అనుమానాలు..

|

Jan 20, 2021 | 9:43 AM

హైదరాబాద్ నగరంలోని బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధి మామిడిపల్లి, జల్‌పల్లి పురపాలిక కార్గోరోడ్డులో చిరుత సంచరిస్తున్నట్లు పహాడీషరీఫ్‌

హైదరాబాద్ నగర శివారులో చిరుత కలకలం.. జల్‌పల్లి కార్గో రోడ్డులో సంచరిస్తున్నట్లు అనుమానాలు..
Follow us on

హైదరాబాద్ నగరంలోని బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధి మామిడిపల్లి, జల్‌పల్లి పురపాలిక కార్గోరోడ్డులో చిరుత సంచరిస్తున్నట్లు పహాడీషరీఫ్‌ పోలీసులు గుర్తించారు. రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు మామిడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రహరీ దూకుతూ చిరుత కనిపించిందని తెలిపారు. అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. దీంతో అటవీ అధికారులకు సమాచారం అందించగా వారు చిరుత ఆనవాళ్ల కోసం వెతుకుతున్నారు.

గతేడాది రాజేంద్రనగర్‌లో ఆరునెలల పాటు సంచరించి అటవీశాఖ అధికారులకు పట్టుబడిన చిరుత సైతం జల్‌పల్లి మాదన్నగూడ మీదుగానే వెళ్లిందని నిర్ధారించారు. రెండురోజుల క్రితం శంషాబాద్‌ విమానాశ్రయం గోడదూకి వచ్చిన చిరుత, జల్‌పల్లి కార్గొరోడ్డు మీదుగా వెళ్లిన చిరుత ఒకటేనా అన్న అనుమాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అటవీ పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి దాడి చేస్తుందో తెలియక అయోమయంలో ఉన్నారు. వెంటనే చిరుతను పట్టుకొని తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సీఐడీ అధికారులు.. పలు ఆధారాల సేకరణ..