Crime News: బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

Latest Crime News: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదం నెలకొంది. తన పిల్లల పట్ల కన్న తండ్రే కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై అభం శుభం ఎరగని ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం తాడ్కోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఫయాజ్‌ నుంచి 2009లో బాన్సువాడకు వచ్చి.. డ్రైవర్స్ కాలనీలో నివసించే నీలోఫర్‌‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక బాబు […]

Crime News: బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..
Ravi Kiran

|

Mar 07, 2020 | 2:08 PM

Latest Crime News: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో విషాదం నెలకొంది. తన పిల్లల పట్ల కన్న తండ్రే కాలయముడయ్యాడు. మద్యానికి బానిసై అభం శుభం ఎరగని ముగ్గురు కూతుళ్లను చెరువులో ముంచి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన శుక్రవారం తాడ్కోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన ఫయాజ్‌ నుంచి 2009లో బాన్సువాడకు వచ్చి.. డ్రైవర్స్ కాలనీలో నివసించే నీలోఫర్‌‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక బాబు జన్మించారు. ఇక వీరిలో చిన్న కూతురును ఫయాజ్ రూ.50 వేలు తీసుకుని తన బందువులకు దత్తత ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. కొంతకాలం అంతా సజావుగా నడించింది.

అయితే క్రమేపి సెంట్రింగ్ పనిచేసే ఫయాజ్ తాగుడుకు, జూదానికి బానిస అయిపోయాడు. ఎవరూ కూడా అతన్ని పనిలోకి తీసుకోవడం మానేశారు. దీంతో ఇంటి భారం మొత్తం నీలోఫర్ చూసుకోవడం మొదలుపెట్టింది. బట్టలు కుడుతూ, మహిళా సంఘాన్ని నడుపుతూ ఇల్లు చక్కబెడుతోంది. ఇదిలా ఉంటే ఫయాజ్ తాగొచ్చి రోజూ డబ్బులు కోసం భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రతరమైంది. ఇక అదే సమయంలో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులకు భార్య ఫయాజ్‌పై ఫిర్యాదు చేసింది. ఇది దృష్టిలో పెట్టుకున్న అతడు శుక్రవారం ఉదయం ఆమెను తీవ్రంగా కొట్టాడు.

అనంతరం ఫయాజ్ దర్గాలో కందూరు చేస్తున్నారని నమ్మించి ముగ్గురు కూతుళ్లు, కొడుకును సమీపంలో ఉన్న తాడ్కోల్ చెరువు వద్దకు తీసుకువెళ్లాడు. అయితే నాలుగేళ్ల కుమారుడు మాత్రం మార్గం మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయాడు. దీనితో ముగ్గురు కూతుళ్లు ఆఫియా బేగం(10), మహీన్‌ బేగం (8), జోయా (6)లను చెరువు దగ్గరకు తీసుకెళ్లి బలవంతంగా నీటిలో ముంచి చంపేసి కూల్‌గా ఇంటికి చేరుకున్నాడు. తడిసిన బట్టలతో వచ్చిన భర్తను చూసిన నీలోఫర్.. కూతుళ్లు ఎక్కడని ప్రశ్నించింది. దానికి అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది.

నీలోఫర్ హుటాహుటిన తాడ్కోల్ చెరువు వద్దకు వెళ్ళింది. అక్కడ కూతుళ్ల చెప్పులు కనిపించడంతో స్థానికులకు విషయం చెప్పింది. వారు చెరువులో గాలించగా ముగ్గురు పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి ఫయాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, నిందితుడ్ని బహిరంగంగా ఉరి తీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu