AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్.. వైభవ్ కెరీర్‌ని ఆగం చేశారుగా..?

Team India Performance: ఇప్పటికైనా బీసీసీఐ, జట్టు యాజమాన్యం తక్షణమే స్పందించి లోపాలను సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాబోయే ఐదో టీ20 మ్యాచ్‌లో పిచ్ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్లేయింగ్ ఎలెవన్ ఏదైనా సరే భారత జట్టు సర్వశక్తులూ ఒడ్డి విజయం సాధించాల్సిందే. మరి ఈ ఆఖరి పోరాటంలోనైనా టీం ఇండియా ఘనమైన పునరాగమనం చేసి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్.. వైభవ్ కెరీర్‌ని ఆగం చేశారుగా..?
Eng Vs Ind 5th T20i Players
Venkata Chari
|

Updated on: Jul 11, 2026 | 9:50 AM

Share

ENG vs IND 5th T20I: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియాకు వరుస ఓటములు తీవ్ర నిరాశను మిగిల్చాయి. నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ ఘోర పరాజయాన్ని చవిచూడటంతో ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఇక జరగబోయే ఐదో టీ20 మ్యాచ్ కేవలం పరువు కోసం ఆడే పోరాటంగానే మిగిలింది. యువ ఆటగాళ్లతో కూడిన ఈ జట్టు వైఫల్యాలపై ఇప్పుడు తీవ్ర చర్చ నడుస్తోంది.

సీనియర్లు లేకపోతే గెలవలేమా..?

వరుస ఓటములతో కుంగిపోతున్న భారత్ మ్యాచ్ గెలవాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉండాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతర్జాతీయ క్రికెటర్లుగా చెలామణి అవుతున్న ఈ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పిచ్‌ల పరిస్థితులకు ఎందుకు అలవాటు పడలేకపోతున్నారనేది పెద్ద మిస్టరీగా మారింది. ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో వైఫల్యం సహజమే అయినా, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ పాత తప్పులనే పునరావృతం చేయడం అభిమానులను కలవరపెడుతోంది.

ఇది కూడా చదవండి: ఆ చెత్త ప్లేయర్.. ఇలాగే ఛాన్స్‌లిస్తే జింబాబ్వేపైనా మీరు గెలవలేరు గంభీర్..!

ఇవి కూడా చదవండి

వైభవ్ సూర్యవంశీపై పెరిగిపోతున్న ఒత్తిడి..

జట్టు యాజమాన్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదంగా మారాయి. సంజూ శాంసన్ నిరంతర వైఫల్యాల వల్ల అతడిని పక్కన పెట్టి, 15 ఏళ్ల నూతన సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. అయితే, ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై ఇంత చిన్న వయసులోనే అతడిని బరిలోకి దించడం ఎంతవరకు సమంజసమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ ఫ్లాట్ పిచ్‌లపై రాణించిన ఈ కుర్రాడు, ఇక్కడి కండిషన్లలో ఒత్తిడికి లోనవుతున్నాడు. పెద్ద ఆటగాళ్లే చేతులెత్తేస్తున్న తరుణంలో ఈ పసివాడిపై నెగిటివ్ ప్రెజర్ పెంచడం వల్ల అతడి భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలపై కూడా విమర్శలు వస్తున్నాయి.

ఒంటరి పోరాటం చేస్తున్న శ్రేయస్ అయ్యర్..

నాలుగో మ్యాచ్‌లో జట్టు మైండ్ సెట్ మార్చుకుని, ఆచితూచి ఆడాలని భావించినప్పటికీ ఆ ప్రణాళికలు సరిగ్గా అమలు కాలేదు. ఒక్క శ్రేయస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. జట్టు చేసిన మొత్తం 150 పరుగులలో అయ్యర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ 80 పరుగులు సాధించాడు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడే అయ్యర్, తన లోపాలను అధిగమించి ఈ సిరీస్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. అయితే, మిగతా బ్యాటర్లు కేవలం ఫోర్లు, సిక్సర్లు కొట్టడమే టి20 క్రికెట్ అనుకుంటూ సాంప్రదాయ క్రికెట్ విలువలను మరిచి వికెట్లు పారేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: వద్దని చెప్పినా అంటగట్టేశారు.. అతని వల్లే సిరీస్ కోల్పోయాం.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్..

బౌలింగ్ విభాగాంలో వైఫల్యాలు..

కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్ విభాగం కూడా ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లపై కనీసం ఒత్తిడి కూడా తీసుకురాలేకపోతున్నారు. ఒకట్రెండు వికెట్లు పడుతున్నప్పటికీ మ్యాచ్‌పై పట్టు సాధించడంలో బౌలర్లు విఫలమవుతున్నారు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ పిచ్‌లపై ప్రభావం చూపలేకపోతుంటే, ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు మాత్రం మన బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. దీనితో పాటు తిలక్ వర్మను బ్యాటింగ్ ఆర్డర్‌లో కింది స్థానంలో పంపడం వల్ల అతని ప్రతిభ వృథా అవుతోందని, అతనికి తగిన నెంబర్ 4 స్థానాన్ని కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్..?
ఆ ముగ్గురు లేకపోతే గెలవడం మీ వల్ల కాదా గంభీర్..?
ఆ నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు: TRAI
ఆ నంబర్ సిరీస్‌తో వచ్చే కాల్స్‌ను బ్లాక్ చేయడం సాధ్యం కాదు: TRAI
ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!
ఆషాఢం అమావాస్య.. వీరికి ఏది చేసినా అంతా మంచే!
జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపనపై కేంద్రం తాజా ఆదేశాలు ఇవే
జాతీయ గీతం, జాతీయ గేయం ఆలాపనపై కేంద్రం తాజా ఆదేశాలు ఇవే
బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. మార్కెట్లో ఎందుకింత క్రేజ్?
బంగారం ధరలా దూసుకెళ్తున్న ఈ కూరగాయ.. మార్కెట్లో ఎందుకింత క్రేజ్?
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
విమానం గాల్లో ఉండగా పగిలిన కిటికీ.. ప్రయాణికుడిని లాగేసిన గాలి
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
ATM కార్డుపై రూ. 5 లక్షల ఉచిత బీమా ఉంటుందని మీకు తెలుసా?
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
మీఇద్దరికిదే లాస్ట్ ఛాన్స్.. అభిషేక్, వైభవ్‌లకు బీసీసీఐ వార్నింగ్
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
గుడిలో ధ్యానం చేస్తే మనశ్శాంతి ఎందుకు కలుగుతుంది? అసలు రహస్యం ఇదే
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..
నాకు నా తండ్రంటే ఇష్టం లేదు.. అందుకే హిందువుగా మారిపోయా..