లడఖ్‌లో మరో 20 మందికి కరోనా

|

May 30, 2020 | 8:14 PM

కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లడఖ్‌లో 20 మందికి కరోనా వైరస్‌ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74 కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. లడఖ్‌లోని కార్గిల్‌ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదవగా మరో మూడు పాజిటివ్‌ కేసులు లేహ్‌ జిల్లాలో నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో మొత్తం కేసుల్లో 43 మందికి చికిత్స అందించి వారికి నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఇంకా 31 యాక్టివ్‌ […]

లడఖ్‌లో మరో 20 మందికి కరోనా
Follow us on

కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లడఖ్‌లో 20 మందికి కరోనా వైరస్‌ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 74 కు చేరుకుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. లడఖ్‌లోని కార్గిల్‌ జిల్లాలో 17 కొత్త కేసులు నమోదవగా మరో మూడు పాజిటివ్‌ కేసులు లేహ్‌ జిల్లాలో నమోదయ్యాయి. ఈ ప్రాంతంలో మొత్తం కేసుల్లో 43 మందికి చికిత్స అందించి వారికి నెగెటివ్‌ రావడంతో ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ప్రస్తుతం ఇంకా 31 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. వీటిలో కార్గిల్‌లో 26, లేహ్‌లో 5 కేసులు ఉన్నాయి. వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇక స్థానిక ఉద్యోగులు కరోనా విపత్తును ఎదుర్కునేందుకు తమ ఒక్క రోజు జీతం రూ.2.76 కోట్లు ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించారు.