కర్నూలు జిల్లాకు చెందిన టిడిపి నాయకుడు, మాజీ సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎవి సుబ్బారెడ్డి సొంత పార్టీపై సంచలన వాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ తనను గుర్తిస్తే పార్టీలో యాక్టివ్ గా ఉంటానని.. లేదంటే ఇలానే ఉంటానంటూ తన మనసులో మాట బయటపెట్టారు. టిడిపి నూతనంగా ప్రకటించిన రాష్ట్ర, జిల్లా కమిటిలలో తనను గుర్తించకపోవడంపై అయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నంద్యాలలో ఒక షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “నంద్యాలలో ఉన్నది అంతా నా వర్గమే.. నేను భుమా నాగిరెడ్డి వేరు వేరు కాదు, అందుకే ఎన్నికల్లో వారసత్వంగా భూమా బ్రహ్మానందరెడ్డి కి అవకాశం ఇస్తే అభ్యంతరము చెప్పలేదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తన వర్గం వాళ్ళకు నంద్యాలలో అవకాశం వచ్చిందని, నా వర్గం వారికి ఇబ్బంది కల్గితే అప్పడు అలోచిస్తానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.