రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత!

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ ను కూకట్ పల్లి కోర్టు కొట్టివేసింది. రేవంత్ తరఫు లాయర్ రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని వాదనలు వినిపించారు. తమ క్లయింట్ రేవంత్‌కు తెలియకుండా

రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత!
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2020 | 5:59 PM

Congress MP Revanth Reddy: కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ ను కూకట్ పల్లి కోర్టు కొట్టివేసింది. తమ క్లయింట్ రేవంత్ రెడ్డిపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టారని ఆయన  రేవంత్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. రేవంత్‌కు తెలియకుండా ఎలాంటి ముందస్తు నోటీస్ లు లేకుండా కేసులు పెట్టారని కోర్టుకు తెలిపారు రేవంత్ న్యాయవాది. అదే సాకుతో పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారని బెయిల్ మంజూరు చెయ్యాలని వాదనలు వినిపించారు.

కాగా.. రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాది ఈ నెల 6న కూకట్ పల్లి కోర్టులో రేవంత్ బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెేటీఆర్‌ ఫాంహౌస్‌ పై డ్రోన్‌ ఎగురవేసిన కారణంగా రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.

Also Read : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. సమ్మెకాలానికి జీతం విడుదల!