AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఎంపికపై చర్చ

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. దీంతో మేయర్ ఎన్నికపై సస్పెన్స్ నెలకొని ఉంది.

రేపు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ.. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఎంపికపై చర్చ
uppula Raju
|

Updated on: Dec 05, 2020 | 7:46 PM

Share

గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ డైలమాలో పడింది. దీంతో మేయర్ ఎన్నికపై సస్పెన్స్ నెలకొని ఉంది. ఏ పార్టీకి రౌండ్ ఫిగర్ స్థానాలు రాకపోవడంతో ఇటు టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం కూడా మేయర్‌ పీటంపై కన్నేశాయి. దీంతో ఒక్కసారిగా బల్దియాలో రాజకీయ వేడి అలుముకుంది. మరోవైపు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ రేపు తెలంగాణ భవన్‌లో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి గెలిచిన కార్పొరేటర్లతో పాటు గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రులను ఆహ్వానించారు.

మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. ఇక ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై కేటీఆర్ సమీక్షించనున్నారు. టీఆర్ఎస్‌కు ఎక్స్అఫిషియో సభ్యులు ఉన్నప్పటికీ మరొకరి సాయంలేకుండా మేయర్ పీటం సాధించే పరిస్థితి లేకుండా ఉంది. దీంతో సభ్యులందరూ అయోమయంలో పడిపోయారు. అందుకే రేపు జరిగే ఈ సమావేశం కీలకం కానుంది. పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? లేదా అనేది కూడా తెలుస్తుంది. కాగా, గ్రేటర్ మేయర్‌కు మరో రెండు నెలల సమయం ఉంది అప్పటి వరకు చూద్దాం అని కేటీఆర్ ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. మేయర్ రేసులో ఎవరెవరు ఉన్నారనేది కూడా రేపటి సమావేశలో స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Follow Us
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
బాయ్స్ హాస్టల్‌లో ల్యాప్‌టాప్, మొబైల్స్ దొంగతనం!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
ఈ ఆకులు కూరల్లో వేస్తే ఘుమఘుమలేకాదు మీ ఆరోగ్యానికీ ఎంతో మేలు..!
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
నా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా రెడీ అయ్యింది
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పండగ పూట పోచమ్మ తల్లి ఆలయంలో నాగు పాము అద్భుత దర్శనం
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
పరగడపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో జరిగే నమ్మలేని మార్పులివే..
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
విండో ఏసీ - స్ప్లిట్ ఏసీ.. ఏది ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
వీకెండ్లో ఈ చికెన్ దోసెను మించిన స్పెషల్ డిష్ మరొకటి లేదు!
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన
అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కందాలపల్లిలో హృదయవిదారక ఘటన