దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి: కేటీఆర్

దుర్గంధం నుంచి శాశ్వత విముక్తి: కేటీఆర్

దుర్గంధం నుంచి నగరవాసులకు శాశ్వత విముక్తి కల్పించడంలో భాగంగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్‌నగర్‌లో ప్లాంటు ప్రారంభం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నగరంలో ప్రతి రోజు 5 వేల నుంచి 6 వేల టన్నుల చెత్తను సేకరించి.. దాన్ని జవహర్‌నగర్‌లో డంపింగ్ […]

Venkata Narayana

|

Nov 10, 2020 | 1:31 PM

దుర్గంధం నుంచి నగరవాసులకు శాశ్వత విముక్తి కల్పించడంలో భాగంగా వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్‌నగర్‌లో ప్లాంటు ప్రారంభం సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. విద్యుత్ ప్లాంట్‌ను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. ఈ విద్యుత్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నగరంలో ప్రతి రోజు 5 వేల నుంచి 6 వేల టన్నుల చెత్తను సేకరించి.. దాన్ని జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందన్నారు. జవహర్ నగర్ లో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, ఈ సమస్య పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేశార్నారు. జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ ప్రజలకు దుర్గంధం నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించేందుకు వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని చెప్పారు. “19.8 మెగావాట్ల ప్లాంట్‌ను ఇవాళ ప్రారంభించనుకున్నాం. 1200 టన్నుల చెత్తను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తున్నాం. జవహర్‌నగర్‌లో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను రూ. 147 కోట్లతో క్యాపింగ్ చేసి సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. స్థానిక ప్రజలకు ఎలాంటి దుర్గంధం, మురికి వాసన లేకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని కేటీఆర్ తెలిపారు. “ప్రస్తుతమున్న జవహర్ నగర్ డంప్ యార్డును వికేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మరో రెండు ప్రాంతాల్లో సంగారెడ్డి జిల్లా లక్డారంలో, మెదక్ జిల్లా ప్యారేనగర్‌లో స్థలాలను ఎంపిక చేశాం. జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయబోతున్నాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.  భాగ్యనగరానికి మరో మణిహారం లాంటి ప్రాజక్టు

— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 10, 2020

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu