AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పట్టణాలకు కేటీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణలోని చిన్న నగరాలు, పట్టణాలకు మునిసిపల్ మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ స్వరాష్ట్రాన్ని సాధంచిన తాము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగానే చిన్న నగరాలకు, పెద్ద పట్ణణాలకు నిధుల కేటాయింపులో పెద్ద పీట వేస్తున్నామని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన దృష్టితో చూస్తున్నారని ఆయన చెప్పారు. మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన […]

తెలంగాణ పట్టణాలకు కేటీఆర్ బంపర్ ఆఫర్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Jan 07, 2020 | 4:37 PM

Share

తెలంగాణలోని చిన్న నగరాలు, పట్టణాలకు మునిసిపల్ మంత్రి కేటీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. నీళ్ళు, నిధులు, నియామకాలు అంటూ స్వరాష్ట్రాన్ని సాధంచిన తాము రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగానే చిన్న నగరాలకు, పెద్ద పట్ణణాలకు నిధుల కేటాయింపులో పెద్ద పీట వేస్తున్నామని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సమాన దృష్టితో చూస్తున్నారని ఆయన చెప్పారు.

మంగళవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ మడికొండలోన టెక్ మహీంద్రా ఐటి ఇంక్యుబేషన్, సిఎంటి ఐటి కంపెణీలను ప్రారంభించారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటి రంగ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. టెక్ మహీంద్రా, సీఎంటి ఐటి కంపెనీలు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. తెలంగాణలో కంపెనీలు నెలకొల్పడం శుభసూచకమని, గ్రామీణ యువతకు ఊపాది అవకాశాలను కల్పించడానికి వరంగల్, కరీంనగర్ తో పాటు.. నల్గొండ, నిజామాబాద్, ఖమ్మంలలో కూడా ఐటీ కంపెనీలను ఈ సంవత్సరంలోనే ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు.

వరంగల్‌లో మూత బడ్డ అజాంజాహి మిల్లు స్థానంలోనే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తున్నామని చెప్పారు కేటీఆర్. హైదరాబాద్-వరంగల్ రహదారి నిర్మాణం వేగంగా సాగుతోందని, ఘట్‌కేసర్ దగ్గర స్కైవే నిర్మాణం జరిగితే కేవలం గంటన్నరలోనే హైదరాబాద్‌కు చేరుకుంటామని వివరించారు. వరంగల్-హైదరాబాద్ హైవేను పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నామని, యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘనపూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

మామూనూర్ ఎయిర్ పోర్టు పునరుద్దరణతో పాటు..హెలిపాడ్ సెంటర్‌ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెంచి సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని కేటీఆర్ చెప్పారు.

మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..
బాలకృష్ణ, చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఇలా..