మేమంటే ఎందుకింత చిన్న చూపు..?

| Edited By:

Jul 06, 2019 | 1:20 PM

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంది. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలు కేంద్రానికి ఆదర్శంగా మారినా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయింపులు లేకపోవడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్ల తర్వాత కూడా విభజన హామీలు నెరవేర్చలేదని.. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్శిటీలు కలలుగా మిగిలిపోయాయని చెప్పారు. ‘కొత్త రాష్ట్రంపై […]

మేమంటే ఎందుకింత చిన్న చూపు..?
Follow us on

కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంది. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవని ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నో పథకాలు కేంద్రానికి ఆదర్శంగా మారినా.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్‌లకు నిధులు కేటాయింపులు లేకపోవడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐదేళ్ల తర్వాత కూడా విభజన హామీలు నెరవేర్చలేదని.. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్శిటీలు కలలుగా మిగిలిపోయాయని చెప్పారు. ‘కొత్త రాష్ట్రంపై ఎందుకింత చిన్నచూపు అంటూ’ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఆర్థిక సర్వే తెలంగాణను ప్రశంసించిందన్న కేటీఆర్.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మొండిచేయి చూపారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం లేదంటే పాలమూరుకైనా జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు కోరినా.. నిరాశే ఎదురైందంటూ మండిపడ్డారు.

మరోవైపు టీఆర్ఎస్ నేత కవిత కూడా బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపు జరపలేదన్నారు. ‘తెలంగాణలో కేసీఆర్ పథకాల అభివృద్ధిని ఆర్థిక సర్వేనే గుర్తించిందని.. అయినా కేంద్ర బడ్జెట్‌లో మాత్రం కేటాయింపులు జరపలేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు.