Krishnappa Gowtham: కృష్ణప్ప.. ఏమిరా లక్కప్ప! ఐపీఎల్ వేలంలో సౌత్ ఇండియా ఆటగాడికి బిగ్ జాక్ పాట్..

Krishnappa Gowtham IPL Auction 2021: ఐపీఎల్ వేలంలో కృష్ణ‌ప్ప‌ గౌత‌మ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన గౌతమ్‌..

Krishnappa Gowtham: కృష్ణప్ప.. ఏమిరా లక్కప్ప! ఐపీఎల్ వేలంలో సౌత్ ఇండియా ఆటగాడికి బిగ్ జాక్ పాట్..
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 18, 2021 | 7:41 PM

Krishnappa Gowtham IPL Auction 2021: ఐపీఎల్ వేలంలో కృష్ణ‌ప్ప‌ గౌత‌మ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకూ గౌతమ్‌కు 24 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. 2018లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన గౌతమ్‌.. చివరగా గతేడాది ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు.

వేలంలో ఆల్‌రౌండ‌ర్ గౌత‌మ్‌ను చెన్నై సూప‌ర్ కింగ్స్ ద‌క్కించుకున్న‌ది. గౌత‌మ్‌ను ఆ జ‌ట్టు 9.25 కోట్ల‌కు సొంతం చేసుకున్న‌ది. 20 ల‌క్ష‌ల బేస్ ప్రైస్‌తో గౌత‌మ్‌పై బిడ్డింగ్ స్టార్ట్ అయ్యింది. కేకేఆర్ జ‌ట్టు అత‌నిపై బిడ్డింగ్‌ను మొదలు పెట్టింది. అయితే కేకేఆర్‌, సీఎస్‌కే, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు .. ఆల్‌రౌండ‌ర్ గౌత‌మ్ కోసం పోటీప‌డ్డాయి. కానీ చెన్నై జ‌ట్టు 9.25 కోట్ల‌కు గౌత‌మ్‌ను కైవ‌సం చేసుకున్న‌ది.  ఇక షారుఖ్‌ఖాన్‌కు ఇదే తొలి ఐపీఎల్‌. కేవలం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, దేశవాళీ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉన్న షారుఖ్‌ఖాన్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, ఆర్సీబీ పోటీ పడగా, చివరకు పంజాబ్‌ కింగ్స్‌ అతన్ని కొనుగోలు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రియం..

చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్ కొనసాగుతోంది. అనూహ్యంగా దక్షిణాఫ్రికాకు చెందిన ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌ను అత్యధిక ధర రూ. 16.25 కోట్లకు రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. గత సీజన్లతో పోలిస్తే ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ మొత్తం కావడం గమనార్హం. క్రిస్ మోరిస్ గత సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఫామ్ లేమితో సతమతమవుతుండటంతో అతడిని ఆర్సీబీ రిలీజ్ చేసింది. బేస్ ప్రైస్ రూ. 75 లక్షల నుంచి రూ. 16.25 కోట్ల వరకు పలికిన మోరిస్‌ను చివరికి రాజస్థాన్ రాయల్స్  దక్కించుకుంది. అటు మ్యాక్స్‌వెల్‌ను రూ. 16,25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంది. యువరాజ్ సింగ్ తర్వాత రూ. 16 కోట్లు దాటిన రెండో ఆటగాడు ఇతడే.

ఇక స్టీవ్ స్మిత్‌ను రూ. 2.20 కోట్లకు ఢిల్లీ,  షకిబుల్ హాసన్‌ను రూ. 3.20 కోట్లకు కోల్‌కతా, మొయిన్ అలీని రూ. 7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్, శివమ్ దూబేను రూ. 4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. కాగా, ఈ మినీ ఆక్షన్‌లో ఇప్పటిదాకా పలువురు స్టార్ ప్లేయర్స్ అమ్ముడుపోలేదు. ఆరోన్ ఫించ్, కేదార్ జాదవ్, లెవీస్, జాసన్ రాయ్, హనుమ విహారి, హాల్స్, కరుణ్ నాయర్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

IPL 2021 Auction LIVE: ఐపీఎల్ మినీ వేలంలో కొత్త చరిత్ర.. రికార్డులను తిరిగరాసిన విదేశీ ఆటగాడు..

IPL 2021 Auction: రూ. 16.25 కోట్లకు మోరిస్‌ను దక్కించుకున్న రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రియం..