ఒక్క మ్యాచ్ గెలిపించాడు.. లెజెండ్‌లతో పోల్చేస్తున్నారు.!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడానికి కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు జట్టుకు కావాల్సిన పరుగులు అందించడమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లో కూడా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇక నెటిజన్లు అప్పుడే రాహుల్‌ని ధోని, రాహుల్ ద్రావిడ్‌లతో పోల్చడం స్టార్ట్ చేసేశారు. అటు […]

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా గెలవడానికి కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన అతడు జట్టుకు కావాల్సిన పరుగులు అందించడమే కాకుండా మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టించాడు. ఒక్క బ్యాటింగ్‌లోనే కాదు.. కీపింగ్‌లో కూడా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 52 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇక నెటిజన్లు అప్పుడే రాహుల్‌ని ధోని, రాహుల్ ద్రావిడ్‌లతో పోల్చడం స్టార్ట్ చేసేశారు. అటు ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆరోన్ ఫించ్‌ను రాహుల్ స్టంపింగ్ చేసిన స్టైల్ అచ్చం ధోని మాదిరి ఉందని కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. 5వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బ్యాట్స్‌మెన్‌లో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని తర్వాత స్థానంలో నిలిచాడు. అటు లోయర్ ఆర్డర్‌లో 150పైగా స్ట్రైక్‌రేట్‌తో 50కి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ రికార్డు సృష్టించాడు.




