నేనే సీఎం కావొచ్చు.. లేదా..!.. కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఇక హైదరాబాద్ రెండో రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేనేలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది.. జాతీయ నాయకత్వామే నిర్ణయిస్తుందన్నారు. […]

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇక హైదరాబాద్ రెండో రాజధాని అంశం కేంద్ర పరిధిలో లేనేలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరనేది.. జాతీయ నాయకత్వామే నిర్ణయిస్తుందన్నారు. అంతేకాదు వీలైతే నేనే సీఎం కావొచ్చు.. లేదా సాధారణ కార్యకర్త కూడా సీఎం కావొచ్చు అన్నారు. ఇక షిర్డీ అంశంతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయోధ్యలో అదిరిపోయే రామాలయం కడతామన్నారు కిషన్ రెడ్డి.