ధర్మపురిలో విషాదం..నులిపురుగుల మెడిసిన్ వికటించి చిన్నారి మృతి

|

Feb 10, 2020 | 7:21 PM

జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  ధర్మపురి అంగన్‌వాడి కేంద్రంలో మెడిసిన్ వికటించి ఓ చిన్నారి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే..ధర్మపురి అంగన్‌వాడిలో స్థానిక ఆశావర్కర్లు చిన్నారులకు నులిపురుగు నివారించే మెడిసిన్ ఇచ్చారు. అక్కడే  ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న సహస్ర అనే 7 ఏళ్ల పాప కూడా కూడా ఆ ట్యాబ్లెట్లు వేసుకుంది. కొద్ది సమయం కాగానే ఆ పాపకు విపరీతమైన వాంతులు అయ్యాయి..ఆ వెంటనే ఫిట్స్ కూడా వచ్చాయి. దీంతో వెంటనే పేరెంట్స్ దగ్గర్లోని ప్రవేట్ ఆస్పత్రికి […]

ధర్మపురిలో విషాదం..నులిపురుగుల మెడిసిన్ వికటించి చిన్నారి మృతి
Follow us on

జగిత్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.  ధర్మపురి అంగన్‌వాడి కేంద్రంలో మెడిసిన్ వికటించి ఓ చిన్నారి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే..ధర్మపురి అంగన్‌వాడిలో స్థానిక ఆశావర్కర్లు చిన్నారులకు నులిపురుగు నివారించే మెడిసిన్ ఇచ్చారు. అక్కడే  ఓ ప్రైవేటు స్కూల్‌లో చదువుతున్న సహస్ర అనే 7 ఏళ్ల పాప కూడా కూడా ఆ ట్యాబ్లెట్లు వేసుకుంది. కొద్ది సమయం కాగానే ఆ పాపకు విపరీతమైన వాంతులు అయ్యాయి..ఆ వెంటనే ఫిట్స్ కూడా వచ్చాయి. దీంతో వెంటనే పేరెంట్స్ దగ్గర్లోని ప్రవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సిట్యువేషన్ డేంజర్‌గా ఉండటంతో అక్కడి డాక్టర్లు జగిత్యాల పెద్దాసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి వెళ్లేలోగానే మార్గమధ్యములోనే పాప మృతి చెందింది. ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆ పాప మాత్రమే కాదు..ధర్మపురిలో నులిపురుగులు నివారణకు మెడిసిన్ తీసుకున్న మరో 10 మంది చిన్నారులు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సహస్ర మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన డాక్టర్లు..ఆ రిపోర్ట్ వచ్చాక మరణానికి గల కారణాలు చెప్తామంటున్నారు. పాప వేసుకున్న ట్యాబ్లెట్లను కూడా చెక్ చేసి..ఏమైనా పొరపాట్లు జరిగితే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య శాఖ అధికారులు తెలిపారు.