AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాతో పోరులో.. మహారాష్ట్రకు అండగా కేరళ..

కరోనా వైరస్ మహారాష్ట్రలో విలయ తాండవం సృష్టిస్తోంది. అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 2,361 మంది చనిపోయారు. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇవాళ ఒక్క రోజే ముంబైలో 1,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం సంఖ్య 40,887కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో నగరంలో […]

కరోనాతో పోరులో.. మహారాష్ట్రకు అండగా కేరళ..
Ravi Kiran
|

Updated on: Jun 01, 2020 | 10:08 PM

Share

కరోనా వైరస్ మహారాష్ట్రలో విలయ తాండవం సృష్టిస్తోంది. అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70,013 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 2,361 మంది చనిపోయారు. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. ఇవాళ ఒక్క రోజే ముంబైలో 1,413 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో.. మొత్తం సంఖ్య 40,887కు చేరింది. అటు గడిచిన 24 గంటల్లో నగరంలో వైరస్ వల్ల 40 మంది మృతి చెందటంతో మరణాల సంఖ్య 1,319కి చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనాతో పోరులో మహారాష్ట్రకు కేరళ అండగా నిలిచింది.

ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళ సర్కార్ దాదాపు 150 మంది నర్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని మహారాష్ట్రలో సేవలందించేందుకు పంపించనుంది. ఇవాళ 16 మంది ముంబై వెళ్లగా.. మరో రెండు మూడు రోజుల్లో 50 మంది డాక్టర్లు, 100 మంది నర్సులు వెళ్తారని కేరళ అధికారులు వెల్లడించారు. కాగా, కేరళ ప్రభుత్వం చేస్తున్న ఈ సాయంతో వైద్యుల కొరత తీరుతుందని మహారాష్ట్ర అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
శ్రీరామనవమికి చలిమిడి ప్రసాదం..తయారీ రహస్యాలు తెలిస్తే రుచి అమోఘం
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
నాన్‌వెజ్ ప్రియులకు బ్యాడ్‌ న్యూస్.. మూతబడనున్న చికెన్ షాపులు!
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
రాంచరణ్ త్వరగా కోలుకోవాలి.. పవన్ కళ్యాణ్..
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
ద్రాక్ష Vs అరటిపండు.. షుగర్ ఉన్నవాళ్లు ఏ పండు తింటే మంచిది..?
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
నల్ల టమాటాలు వచ్చేశాయి.. రాత్రిపూట వచ్చే ఆ సమస్యలన్ని మాయం
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
ఏపీలో పెన్షన్ కావాలా..? ప్రభుత్వం భారీ శుభవార్త
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
పీఎస్ఎల్ ప్రారంభానికి ముందే తప్పుకున్న మరో స్టార్ ప్లేయర్!
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
శ్రీరామనవమి స్పెషల్: పానకం,వడపప్పు రుచిగా రావాలంటే ఇలా ట్రైచేయండి
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్..