ఖమ్మం గుమ్మంలో గులాబీ వికసించేనా..? సీనియర్లను పక్కన పెట్టి ఇద్దరు కొత్తవారికి రాజ్యసభ పదవులు కట్టబెట్టడం పార్టీకి లాభమా..? నష్టమా..? ఇన్నాళ్లు ఎవరికి వారే యమునాతిరే అన్న రీతిలో వ్యవహరించిన నాయకుల తీరు మారేనా…? ఆ ముగ్గురు నాయకుల పై గులాబీ బాస్ కేసీఆర్ నజర్ ఎలా ఉంది…? బుజ్జగిస్తారా…? వదిలేస్తారా… ముఖ్యమంత్రి ముందు త్వరలో జరగబోయే ఖమ్మం పార్టీ మీటింగ్ ఇప్పుడు హాట్ టాపిక్.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అధికార టిఆర్ ఎస్ పార్టీకి మంచి పట్టున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పార్టీకి పట్టురావడం లేదు…2018 సాధారణ ఎన్నికల్లోనూ కేవలం ఒక్క ఎమ్మెల్యే స్థానం మాత్రమే గెలిచింది టిఆర్ఎస్..2019 లో ఎంపీ గెలిచింది…ఇతర పార్టీల నుండి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే లు టిఆర్ ఎస్ పార్టీలోకి చేరినా సొంతగా మాత్రం పార్టీ అక్కడ ఇంకా బలపడకపోవడానికి కారణం నేతల మధ్య సమన్వయలోపమే అన్నది ఓపెన్ సీక్రెట్…మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత పార్టీ నేతల కుట్రల వల్లే తాను ఓడిపోయానిని బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు… అటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పై టిఆర్ ఎస్ ఎమ్మెల్యే లే దుమారం లేపిన సంఘటనలూ చూసాం.. ఎమ్మెల్యే రేగ కాంతారావు వర్సెస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ చూసిందే… వీరికి తోడు కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా చాలా కాలంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటూ ఈ మధ్య మళ్ళీ సిన్ లోకి వచ్చారు.
మంత్రి వర్గం ఒకవైపు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్యాచ్ ఒక వైపు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో వైపు ఇలా ముఖ్యనాయకులు తలో దారిలో వెళ్లడం పార్టీకి ఇబ్బంది గా మారింది..దానికి తోడు ఇప్పుడు కొత్తవారికి రాజ్యసభ పదవులు ఇవ్వడంతో పాత నేతలు రగిలిపోతున్నట్టు సమాచారం..అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ను చక్కదిద్దేందుకు స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగనున్నటు సమాచారం…ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలతో ప్రగతి భవన్ లో కెసిఆర్ సమావేశం అవుతున్నారంటా. జూన్ మొదటి వారంలో జరిగే ఈ మీటింగ్ లో ఖమ్మం నాయకులకు ఎలాంటి డైరెక్షన్ ఇస్తారూ అనేది పక్కన బెడితే ఈ మీటింగ్ కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి, తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావు లకు ఆహ్వానం ఉంటుందా లేదా అనేది ఖమ్మం టిఆర్ ఎస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..