కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ కుటుంబంలో కరోనా కలవరం..!

|

May 25, 2020 | 4:34 PM

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనావైరస్ ఎవరిని వదలడంలేదు. ఇటు భారత్ లోనూ రోజు రోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అడ్వైజర్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన భార్య, కొడుకును రియాసి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్వైజర్ భార్య, […]

కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్వైజర్ కుటుంబంలో కరోనా కలవరం..!
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కరోనావైరస్ ఎవరిని వదలడంలేదు. ఇటు భారత్ లోనూ రోజు రోజుకి కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ జీసీ ముర్ము అడ్వైజర్ ఫ్యామిలీలో కరోనా కలకలం రేపింది. అడ్వైజర్ భార్య, కొడుకుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో అడ్వైజర్ సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారని అధికారులు తెలిపారు. ఆయన భార్య, కొడుకును రియాసి జిల్లాలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అడ్వైజర్ భార్య, కొడుకు కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి జమ్మూ తిరిగి వచ్చి గెస్ట్ హౌస్​లో ఉంటున్నారు. కొద్దిపాటి అస్వస్థతతో..
వారి శాంపిల్స్ టెస్టులకు పంపగా.. కొవిడ్-19 పాజిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. అడ్వైజర్ నుంచి కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కి పంపించామన్నారు. గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న వారందర్ని కూడా మరోసారి కరోనావైరస్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.