AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కార్తీక శోభ

తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. ఈ నెల సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటేసమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన […]

ఏపీలో కార్తీక శోభ
Pardhasaradhi Peri
| Edited By: |

Updated on: Oct 29, 2019 | 6:02 PM

Share
తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల కార్తీకమాసం. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో కలిసిన రోజు కార్తీకం. ఈ నెల సదాశివుడు, మహావిష్ణువు పూజలకు చాలా పవిత్రమైనది. ఈ మాసంలో ఏకభుక్తం, నిరాహారాది వ్రతాలు చేస్తారు. సాయంత్రాలు
దేవాలయాలు, తులసి దగ్గర దీపాలు వెలిగిస్తారు. దీపదానాలు చేయలేనివారు గాలికి ఆరిన దీపాలు వెలిగించినా దీపదానం అంత ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఒక్కమాటలో చెప్పాలంటే కార్తీక మాసానికి సమానమైన మాసం, విష్ణుదేవునికంటేసమానమైన దేవుడు, వేదాలకు సమానమైన శాస్త్రాలు, గంగకంటే పుణ్యప్రదమైన తీర్థాలు లేవని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అత్యంత ప్రవిత్రమైనది, మహిమానిత్వమైన మాసం. ఈ మాసంలో దేశం నలుమూలల్లో ఉన్నశివాలయాల్లోరుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, రుద్రపూజలు విశేషంగా జరుపుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా, గోదావరిలోభక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో కార్తీక మాసం సందడి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం  సోమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. గోదావరి నదీ తీరంలోనిశైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలన్నీ హరహర మహాదేవ శంభోశంకర అంటూ శివనామ స్మరణతో మార్మోగాయి. పురాణ ప్రాశస్థ్యం కలిగిన రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌, పుష్కరఘాట్‌లతో పాటు సరస్వతీ ఘాట్‌, గౌతమిఘాట్‌లు మరింత రద్దీగా కనిపించాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం కావడంతో తెల్లవారుజాము 2 గంటల నుండే కార్తీక పూజలు ప్రారంభమయ్యాయి. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాదగయ

Follow Us
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్..!
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
కనురెప్పలు ఎందుకుండవ్.. పూరీ జగన్నాథుడి కళ్ల వెనకున్న శక్తి..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు మేం రెడీ..
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
ఇలా ఉన్నారేంట్రా సామీ! కాటేసిన కోబ్రాను డబ్బాలో పెట్టి ఆస్పత్రికి
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఈ వాస్తు విషయాలు తప్పక చూడండి..
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఈపీఎఫ్ అకౌంట్ ఉందా..? నెలకు రూ.7,500 పెన్షన్ రానుందా..?
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
ఆర్టీసీకి చుక్కలు చూపించిన ప్రయాణికుడు.. రూ.15 వేల ఫైన్!
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
బలహీనంగా ఉన్న వారికి ఇది ఒక్క ముద్ద చాలు.. డబుల్ బెనిఫిట్స్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
చిన్నప్పుడు భిక్షాటన చేసిన వ్యక్తి. ఇప్పుడు ఏపీలో పోలీస్ ఆఫీసర్
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..
రాత్రి భోజనం చేసిన తర్వాత వాంతులు, హాస్పిటల్‌కు వెళ్లగా..