AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ డిప్యూటీ సీఎం ఇళ్లపై ఐటీ రైడ్స్.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ తినాల్సిందే..!

కర్ణాటకలో ఐటీశాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో దాదాపు రూ.5.00 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జీ.ప‌ర‌మేశ్వ‌ర‌ ఇంటితో పాటు ఆయన ఇత‌ర నివాసాల్లో గురువారం ఐటీ దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో సుమారు రూ. 5 కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు ఇవాళ ఐటీ అధికారులు చెప్పారు. శుక్రవారం కూడా మ‌రో 25 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గురువారం […]

మాజీ డిప్యూటీ సీఎం ఇళ్లపై ఐటీ రైడ్స్.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ తినాల్సిందే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 11, 2019 | 8:36 PM

Share

కర్ణాటకలో ఐటీశాఖ ఆకస్మిక దాడులు చేపట్టింది. ఈ తనిఖీల్లో దాదాపు రూ.5.00 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి జీ.ప‌ర‌మేశ్వ‌ర‌ ఇంటితో పాటు ఆయన ఇత‌ర నివాసాల్లో గురువారం ఐటీ దాడులు చేసిన విష‌యం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జ‌రిపిన సోదాల్లో సుమారు రూ. 5 కోట్ల న‌గ‌దు దొరికిన‌ట్లు ఇవాళ ఐటీ అధికారులు చెప్పారు. శుక్రవారం కూడా మ‌రో 25 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గురువారం బెంగుళూరుతో పాటు తుమ‌కూరులోని ప‌లు ప్రాంతాల్లో సోదాలు చేశారు.

జీ. పరమేశ్వర ఇళ్లలోనే కాకుండా.. మాజీ ఎంపీ ఆర్‌ఎల్‌ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై కూడా ఐటీ శాఖ గురువారం దాడులు జరిపింది. పరమేశ్వర కుటుంబం సిద్ధార్థ గ్రూప్‌ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలను పరమేశ్వర తండ్రి హెచ్‌ఎం గంగాధరయ్య యాభై ఎనిమిది ఏళ్ల కిందట స్థాపించారు. పరమేశ్వర ఇంటితోపాటు ఆయన విద్యా సంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరమేశ్వర సోదరుడు శివప్రసాద్‌, వ్యక్తిగత సహాయకుడు రమేశ్‌ ఇండ్లపై కూడా దాడులు జరిగినట్టు అధికారులు తెలిపారు. కోలార్‌ జిల్లా దొడ్డబల్లపురలో ఉన్న ఆర్‌ఎల్‌ జాలప్ప ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీని రాజేంద్ర నిర్వహిస్తున్నారు. నీట్‌ పరీక్ష విషయంలో కోట్లాది రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది ఐటీ సిబ్బంది ఇద్దరు నేతలకు సంబంధించిన 30 ప్రాంతాలలో దాడులు చేసినట్టు అధికారులు చెప్పారు.

కర్ణాటకలోనే కాదు.. అటు రాజస్థాన్‌లోని వారి కార్యాలయాలపై కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. తుమకూరు నగరంలో శ్రీ సిద్ధార్థ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలోని రెండు మెడికల్‌ కళాశాలల్లో జరిగిన నీట్ పరీక్షల్లో.. అనేక అవకతవకలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరీక్షల్లో నీట్ అభ్యర్థులకు బదులుగా వేరొకరితో పరీక్షలు రాయించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు గాను.. లక్షల రూపాయలు చేతులు మారాయని.. పుకార్లు వచ్చాయి. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తున్నది. కాగా, దాడులపై తనకు సమాచారం లేదని.. దాడులు ఎందుకు జరుపుతున్నారో కూడా తెలియదని పరమేశ్వర తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేస్తూ.. కావాలనే ఐటీ దాడులు కేంద్ర చేయిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, మరోవైపు ఈ ఐటీ దాడుల్లో మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర ఆస్తులు రూ.5,000 కోట్లకు పైగా ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించినట్లు అనధికార సమాచారం అందుతోంది.

Follow Us
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!