Breaking: రైలు కిందపడి కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ధర్మగౌడ ఆత్మహత్య.. పోలీసుల దర్యాప్తు..
SL Dharmegowda Death: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ స్పీకర్ ధర్మగౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో...

SL Dharmegowda Death: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ స్పీకర్ ధర్మగౌడ బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతదేహాన్ని చిక్కమంగళూరు కడూర్ ప్రాంతంలోని రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనను పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అటు మాజీ ప్రధాని, జేడీఎస్ నేత హెచ్.డీ దేవగౌడ.. డిప్యూటీ స్పీకర్ ధర్మగౌడ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 16వ తేదీన శాసనమండలిలో జరిగిన రభస కారణంగా ధర్మగౌడ తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Karnataka: Body of SL Dharmegowda, Deputy Speaker of State Legislative Council was found on a railway track near Kadur in Chikkamagaluru. A suicide note has been recovered.
— ANI (@ANI) December 29, 2020




